TIRUMALA JEO REVIEWS ON TUMBURU TEERTHAM ARRANGEMENTS_ తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు -తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 24 March 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju has reviewed on the arrangements to be made for the upcoming torrent festival-Tumburu Teertha Mukkoti which occurs on March 31 this year.

The review meeting with various departmental heads was held at Annmaiah Bhavan in Tirumala on Saturday. The JEO instructed the departments especially Engineering, Forest, Vigilance, Annaprasadam and Health departments on the measures and arrangements to be made for the big religious event.

SECURITY OF BOTH ECOLOGY AND DEVOTEES ARE IMPORTANT

The JEO said, though the fete is not directly related to Tirumala temple, Tumburu Teertham is considered to be one of the most important torrents among the Saptha Teerthas present in the lush green forests of Seshachalam ranges in Tirumala, TTD has been making elaborate arrangements for the festival keeping in view the increasing pilgrim rush. “This is located at about 9km from Tirumala temple. As this coincides on Phalguna Pournima day, the inflow of pilgrims has increased from the past few years. So we are paying extra attention to make the event a smooth one, especially after the 2014 forest fire mishap. Though the festival is on March 31, the devotees throng to Tumburu Teertham a day before itself. So all the departments should be attentive”, the JEO informed.

NO PERMISSION FOR COOKING BY DEVOTEES:

The JEO has clearly instructed the vigilance, forest, health and fire departments not to permit any devotee to cook their own food in the Teertham. “The food arrangements will be made by Annaprasadam wing of TTD alone and outsiders will not be permitted. The devotees are strictly banned from carrying cooking articles. The forest and police officers should thoroughly check Mamandur, Karakambadi, Balapalli roads as devotees throng Tumburu teertham via these routes”, he added.

TWO LAKHS WATER AND 80K BUTTER MILK PACKETS:

He has instructed the Health and Annaprasadam wings to keep ready Two Lakh water sachets, 15 one litre bottles and 50 thousand butter milk packets ready to distribute among the pilgrims as more than 30-35 thousand pilgrims are expected to take part in this fete. “During last year the figures crossed 30 thousands and this year we should be prepared with five thousands more. Utilize the services of Srivari Sevakulu for packing and distribution of food and water to devotees”, he added.

OFFICERS TEAM TO INSPECT THE ARRANGEMENTS ON MARCH 26

The JEO instructed a team of officers comprising all departments to inspect the arrangements at Teertham on March 26 to make necessary arrangements.

ANNOUNCEMENTS:

He instructed the radio and broad casting wing to make continuous announcements on the precautionary measures including ban of cooking by outsiders, to reach Tumburu Teertham only via Papavinasanam route and not from Mamandur etc. for the sake of the safety of the devotees.

ELABORATE SECURITY ARRANGEMENTS:

The JEO has also instructed the vigilance wing officials to deploy additional men at different points all through the route from Papavinasanam to Tumburu Teertham and also instructed to negotiate with Tirumala police on security arrangements.

MEDICAL CAMPS AT PAPAVINASANAM

The CMO Dr Nageswara Rao was instructed to set up medical camps in the Papavinasanam route as the devotees trek Tumburu Teertham via this route. He has also instructed to keep ready three ambulance vans in the case of any emergency.

ENGINEERING ARRANGEMENTS:

JEO directed the Engineering wing to make necessary arrangements to enable the pilgrims to safely reach their destination. “Display information boards about the safety measures, banned cookery goods etc. and also the closing time of trekking for the information of the devotees”, he said.

SE II Sri Ramachandra Reddy, GM Transport Sri Sesha Reddy, VSO Sri Ravindra Reddy, Temple DyEO Sri Harindranath, Health Officer Dr Sermista, Annaprasadam SO Sri Venugopal, Catering Officer Sri Shastry, Garden Superintendent Sri Srinivasulu were also present.

Later the JEO reviewed on SSD counters with TTD IT department and TCS Officials.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు -తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 24, తిరుమల 2018: పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పూర్ణిమినాడు అనగా మార్చి 31వ తేదీన తిరుమలలోని వివిధ ప్రముఖ తీర్థాల్లో ఒకటైన శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి జరుగనున్న నేపథ్యంలో అందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జెఈవో

శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం తుంబురు తీర్థ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లడుతూ తుంబురు తీర్థ ముక్కోటికి మార్చి 30వ తేదీ ఉదయం నుండి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. అంతకుముందు భక్తులను అనుమతించరని వివరించారు. గత ఏడాది దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు విచ్చేసారన్నారు. ఈ ఏడాది కూడా విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున టిటిడి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అందులో భాగంగా భక్తులందరికి రెండు లక్షల తాగునీరు ప్యాకెట్లు, 50వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో మార్చి 30వ తేది ఉదయం 10.00 గంటల నుండి భక్తులకు పులిహోరా, పెరుగన్నం ప్యాకెట్లు భక్తులకు అందించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. ముందుగానే ఈమేరకు ఒక భక్తుడికి రెండు పులిహోరా ప్యాకెట్లు, ఒకపెరుగన్నం ప్యాకెట్టు, నాలుగు త్రాగునీరు ప్యాకెట్లు, రెండు మజ్జిగ ప్యాకెట్లు ఒక సంచిలో వేసి అందివ్వాలని ఆయన సూచించారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, పాపావినాశనం నుండి 4 కిలోమిటర్ల వరకు త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారుల ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బొర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా టిటిడి రేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా ఎటువంటి వంట సామగ్రిని అనుమతించరని తెలియచేసేందుకు ఏర్పాట్లు చేయాలని, మార్గమధ్యలో భక్తులకు ఇబ్బంది లేకుండా సోలార్‌ లైట్లు, రోప్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

మామండూరు, కుక్కలదొడ్డి మార్గాల నుండి వచ్చే భక్తులు ఎటువంటి వంట సామగ్రి అనుమతించరాదని పోలీసుశాఖ, అటవీశాఖ అధికారులకు సూచించారు. తుంబురు తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలని అందుకు అనుగుణంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖ, అటవీశాఖ మరియు టిటిడి విజిలెన్స్‌ సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా రెండు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలవారు సమన్వయంతో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

మార్చి 26వ తారీఖున అన్ని విభాగాలతో కూడిన అధికారుల బృందం తుంబురు తీర్థాన్ని పర్యటించి ముందస్తుగా చేయవలసిన ఏర్పాట్లును చూసుకోవాలని సూచించారు. మార్చి 31న తుంబురు తీర్థ ముక్కోటిలో పాల్గొనడానికి ఒకరోజు ముందే భక్తులు తీర్థాన్ని చేరుకొనే అవకాశం ఉంది కనుక ఈ ఏర్పాట్లన్నీ మార్చి 29వ తేది కల్లా పూర్తి చేయాలని అదికారులను ఆదేశించారు. తుంబురు తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులు అటవీ ప్రాంతాన్ని కాపాడాలని జెఈవో విజ్ఞప్తి చేశారు. అనంతరం జెఈవో సమయ నిర్దేశిత సర్వదర్శనంపై ఐటి, టిసిఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎస్‌.ఇ.2 శ్రీ రామచంద్రా రెడ్డి, జియం ట్రాన్స్‌పోర్టు శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంధ్రరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆరోగ్యవిభాగం అధికారిణి డా|| శర్మిష్ఠ, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాటరీంగ్‌ అధికారి శ్రీ శాస్త్రీ, ఇతర విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.