SRI RAMANAVAMI ASTHANAM IN SRIVARI TEMPLE ON MARCH 25_ మార్చి 25న హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు

SRI RAMA PATTABHISHEKAM ON MARCH 26

Tirumala, 19 March 2018: In view of Sri Rama Navami on March 25, Asthanam will be observed in Tirumala temple on the same day night between 10pm and 11pm at Bangaru Vakili inside temple.

In the morning there will be Snapana Tirumanjanam between 9am and 11am in Ranganayakuka Mandapam to the Utsavarulu of Sri Sita Lakshmana Anjaneya Sameta Sri Ramachandramurty.

HANUMANTHA VAHANAM

Later in the evening, Lord will take ride on Hanumantha Vahanam around the four mada streets between 7pm and 9pm.

CORONATION CEREMONY ON MARCH 26

The coronation ceremony of Lord Sri Rama will be observed in Srivari temple on March 26. Asthanam will be performed by 8pm at Bangaru Vakili.

Temple officials will take part in this fete.

TTD has cancelled Vasanthotsavam and Sahasra Deepalankara Sevas on March 25 and Vasanthotsavam on March 26.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 25న హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు

శ్రీవారి ఆలయంలో మార్చి 26న శ్రీరామపట్టాభిషేకం

మార్చి 19, తిరుమల 2018: మార్చి 25వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 26వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.

కాగా రాత్రి 10.00 నుండి 11.00 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

మార్చి 26వ తేదీ సోమవారంనాడు రాత్రి 8.00 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా నిర్వహించే ఈ రెండు కార్యక్రమాలలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించే వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 26వ తేదీ శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవలు యదావిధిగా కొనసాగుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.