“EKASILA NAGARAM” GEARS UP FOR BRAHMOTSAVAMS_ బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

ANNUAL FETE IN VONTIMITTA FROM MARCH 24 TO APRIL 2

ANKURARPANA ON MARCH 23, PUSHPAYAGAM ON APRIL 3

Tirupati, 22 March 2018: The ancient TTD taken over temple of Sri Kodanda Rama Swamy at Vontimitta in Kadapa district is geared up to host the nine day annual religious festival, brahmotsavams from March 25 to April 2.

Also known as “Ekasila Nagaram” as the presiding deities were carved out on a single stone, Ankurarpanam will be performed on March 24. TTD has made elaborate arrangements for the big fete as tens of thousands of devotees from surrounding districts also throng to the temple during this festival.

HISTORY OF THE TEMPLE

The deities of Sri Sita Lakshmana Sameta Sri Ramachandramurthy in the temple were said to be consecrated by Sri Jambavantha in Tretayuga. During his exile, Lord Sri Rama visited this place along with Sita Devi and Lakshmana Swamy. To quench the thirst of Sita, Sri Rama threw an arrow into the earth and water pierced out. This water body is now popularly known as “Rama Teertham” located adjacent to the temple.

TEMPLE ARCHITECHTURE

Built by the rulers of Vijayanagara Dynasty, the inscriptions on the walls of the temple says that this temple was constructed in three phases for three centuries from 14 AD to 17AD.

NAMED AFTER HUNTERS “VONTADU-MITTADU”

There is an interesting story behind the place. Once when king Kamparayalu visited this place along with his entourage, his thirst was quenched with the water provided by two local hunters, Vontadu and Mittadu. Over their request, the King constructed this temple and named the place as “Vontimitta”. However in the year 1356AD Bhukkarayalu opened the temple.

In the later years, the rulers of Vijayanagara constructed Antaralam, Rangamantapam, Mahapranganam, Gopuram, Ratham in a phased manner and developed the temple. Later the Kainkaryams were introduced with the voluntary contributions from villagers.

A LITERARY HUB

According to the available evidences, Vontimitta also stood as a home place for many versatile scholars and literary persons like Bammera Potana who penned Bhagavatam in Telugu, Sri Vavilikolanu Subba Rao, Sri Ayyalaraju Timmappa, Sri Ramabhadrudu, Sri Nallakalva Ayyappa, Sri Annamacharya who rendered many sankeetans on Lord Sri Rama and many more.

BRAHMOTSAVA VAIBHAVAM

On March 24, Ankurarpanam – the festival of prelude will be performed between 8pm and 10pm.

The nine day fete commences with Dhwajarohanam on March 25 at 9:03am in the auspicious Vrishabha Lagnam. The same day evening “”Potana Jayanti” and Sesha Vahanam will be observed.

The important days includes Garuda Seva on March 29, Sri Sita Rama Kalyanam on March 30 and Chakrasnanam on April 2.

Pushpayagam will be performed on April 3.

LORD BLESSES DEVOTEES IN VARIOUS ALANKARA

On each day, Lord Sri Rama blesses the devotees in various “Alankara” as Venugana, Vatapatrasai, Navaneetakrishna, Mohini, Sivadhanurbhana and Kaliyamardhana.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట కోదండరామాలయం

మార్చి 24న అంకురార్పణ, 25న ధ్వజారోహణం

మార్చి 22, తిరుపతి, 2018: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.

ఆలయ చరిత్ర :

పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.

శాసనాల ప్రకారం :

ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు.

ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.

రాములవారిపై సాహిత్యం :

ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట రశరథరామ శతకం చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు.

మార్చి 24న అంకురార్పణ :

శ్రీకోదండరామస్వామివారి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మార్చి 24వ తేదీ శనివారం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం(మూలవర్లకు అభిషేకం), రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

మార్చి 25న ధ్వజారోహణం :

శ్రీకోదండరామస్వామివారి ఆలయ వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మార్చి 25న ఆదివారం ఉదయం 9.03 గంటలకు వృష‌భ ల‌గ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవలు :

తేదీ ఉదయం రాత్రి

25-03-2018(ఆది) ధ్వజారోహణం(ఉ||9.03 గం||లకు) పోతన జయంతి, శేషవాహనం.

26-03-2018(సోమ) వేణుగాన అలంకారం హంస వాహనం

27-03-2018(మంగళ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం

28-03-2018(బుధ) నవనీతక ష్ణ అలంకారం హనుమంత సేవ

29-03-2018(గురు) మోహినీ అలంకారం గరుడసేవ

30-03-2018(శుక్ర) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.

31-03-2018(శని) రథోత్సవం —–

01-04-2018(ఆది) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం

02-04-2018(సోమ) చక్రస్నానం ధ్వజావరోహణం(సా|| 5.30 గం||)

03-04-2018(మంగళ) ——– పుష్పయాగం(సా|| 5 గం||).

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.