TTD TEMPLES CLOSED FOLLOWING LUNAR ECLIPSE_ చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత
Tirupati, 7 August 2017: The sub-temples under the control of TTD were closed on Monday evening by 4:30 pm following lunar eclipse.
It is a usual practice to close the main doors of the temples six hours prior to the eclipse as per agamas.
The famous shrines including Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta, Narayanavanam, Nagalapuram, Tondamanadu etc. which are under the umbrella of TTD were closed.
The main doors of these temples will again open during the wee hours on Tuesday followed by Punyahavachanam and Suddhi before commencing early morning kainkaryams. Later the devotees are allowed for darshan.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత
తిరుపతి, 2017 ఆగస్టు 07: చంద్రగ్రహణం కారణంగా సోమవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.