SRIVARI SEVAKULU PERFORM YOGA AND MEDITATION_ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీవారిసేవకుల యోగాసనాలు
Tirumala, 21 June 2018: Yoga, Pranayama and Jyothi Dhyanam was observed by Srivari Seva volunteers in Srivari Seva Sadan in Tirumala on Thursday.
Every day, the seva volunteers are being involved in orientation, meditation and Satsang programmes twice, both in the morning and in the evening.
On June 21, being International Yoga Day, the Sevakulu also performed Yoga Asanas including Surya Namaskaram, Vrikshasana, Vajrasana etc. Apart from this, they also performed Jyothi Dhyanam, (meditating, concentrating on a light).
The Sevakulu expressed their immense happiness for having performed Yoga in Srivari Seva. Smt. Jamuna Rani from Salem, said, I am a house wife and a trained Yoga instructor. I am happy that I participated in International Yoga Day in Tirumala while I am in Srivari Seva. Another Volunteer, Mr. P Subhash, B.Tech Student from Proddutur said, from the past two years I am taking part in Yoga Day in our college. Today I am overwhelmed, that I took part in International Yoga in Srivari Seva Sadan.
Assistant PRO, Ms P Neelima, Co-ordinator Sri Varaprasad, In-charge of Sri Satya Sai Seva Organisation in two Telugu States Sri Hariharan, OSD Sri Phani Ranga Sai and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీవారిసేవకుల యోగాసనాలు
జూన్ 21, తిరుమల 2018: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌లో శ్రీవారి సేవకులు యోగా, ప్రాణాయామం, జ్యోతిధ్యానం చేశారు. శ్రీవారిసేవకులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవావిధులపై అవగాహన కల్పించడంతోపాటు ధ్యానం, భజన సత్సంగం కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
యోగా దినోత్సవం సందర్భంగా శ్రీవారి సేవకులు సూర్యనమస్కారాలు, వృక్షాసనాలు, వజ్రాసనాలు తదితర యోగాసనాలు వేశారు. అదేవిధంగా, జ్యోతిధ్యానం(దీపం వైపు చూస్తూ చేసే ధ్యానం) చేశారు.
తిరుమలలో శ్రీవారి సేవకు వచ్చి యోగా చేయడంపై శ్రీవారి సేవకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సేలం నుంచి వచ్చిన శ్రీవారి సేవకురాలు శ్రీమతి జమునారాణి మాట్లాడుతూ తాను యోగాలో శిక్షణ పొందానని, తిరుమలలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బిటెక్ విద్యార్థి శ్రీ పి.సుభాష్ మాట్లాడుతూ రెండేళ్లుగా తమ కళాశాలలో యోగా దినోత్సవంలో పాల్గొంటున్నానని, సేవాసదన్‌లో యోగా చేయడం అపూర్వమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, కో-ఆర్డినేటర్ శ్రీ వరప్రసాద్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి శ్రీ హరిహరన్, ఓఎస్‌డి శ్రీఫణిరంగసాయి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.