SUCCESS OF BRAHMOTSAVAMS DEPENDS ON G-DAY PERFORMANCE-RENDER SERVICES WITH PATIENCE AND DEDICATION – EO TO DEPUTATION STAFF _ గరుడసేవనాడు పనితీరుపైనే బ్రహ్మోత్సవాల విజయం ఆధారపడి ఉంటుంది

TIRUMALA, 30 SEPTEMBER 2022: The entire success of nine-day Brahmotsavams depends on how best we offered services to the multitude of visiting pilgrims on the day of Garuda Seva, said TTD EO Sri AV Dharma Reddy.

Addressing the TTD senior officers and employees who have been deputed discharge duties at various points in the four Mada streets for Garuda Seva in the Brahmotsavam Conference Room set up opposite Rambhageecha on Friday afternoon, the TTD EO directed that the facilities which we provide to the devotees on the important day decides the success of Brahmotsavams. “So all the deputed staff should discharge their duties and responsibilities with more patience, efficiency and dedication”, he reiterated.

The on-duty officials in East, West, North and South Mada streets should ensure that every devotee gets the food and water supply. “If any problem is there, it should be immediately taken to the notice of concerned official for redress without any delay”, he maintained.

Earlier, the JEO Sri Veerabrahmam, discussed in elaborate on the action plan for the food distribution and water supply to the pilgrims in the galleries with the help of Srivari Seva volunteers.

CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Special Officer for Catering Sri GLN Shastry, other senior officers, deputation staff were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడసేవనాడు పనితీరుపైనే బ్రహ్మోత్సవాల విజయం ఆధారపడి ఉంటుంది

– ఓర్పు, అంకితభావంతో సేవలందించండి

– డెప్యుటేషన్ సిబ్బందికి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సూచన

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: గరుడసేవనాడు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎంత ఉత్తమంగా సేవలందించామనే అంశంపైనే తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల మొత్తం విజయం ఆధారపడి ఉంటుందని, కావున డెప్యుటేషన్ సిబ్బంది ఓర్పు, అంకితభావంతో సేవలందించాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమల రాంభగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం గరుడసేవ కోసం నాలుగు మాడ వీధుల్లో విధులు కేటాయించిన టిటిడి సీనియర్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఈవో మాట్లాడారు.

తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ మాడ వీధుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రతి భక్తునికీ అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా చూడాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే, ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన సూచించారు.

అంతకుముందు జెఈవో శ్రీ వీరబ్రహ్మం శ్రీవారి సేవకుల సహకారంతో గ్యాలరీలలో భక్తులకు అన్నదానం, నీటి సరఫరా కార్యాచరణ ప్రణాళికపై కూలంకషంగా చర్చించారు.

ఈ సమావేశంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర సీనియర్ అధికారులు, డెప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.