SV ANNAPRASADAM COMPLETES 33 YEARS OF ITS SUCCESSFUL JOURNEY-TIRUMALA JEO_ టిటిడిలో అన్నప్రసాద వితరణకు 33 ఏళ్లు పూర్తి : జెఈవో

HAD ANNAPRASADAM IN MTVAC

Tirumala JEO Sri KS Sreenivasa Raju said that with the support of donors the SV Annaprasadam has completed its 33 years of its successful journey in serving multitude of visiting pilgrims in Tirumala.

On the occasion of 33rd anniversary of Annaprasadam, the JEO had Annaprasadam in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) in Tirumala on Friday. Speaking to media on this occasion, the JEO said, SV Annaprasadam is unique among all the donation trusts that are being run by TTD.

Started on a small scale in 1985 on April 6 with just 2000 pilgrims today Annaprasadam is being served to over 1.5lakh devotees in Tirumala every day”, he added.

He said at present the trust holds Rs.937crores in the form of fixed deposits in different nationalized banks and the interest on this amount is used by the Annaprasdam department to serve food to unlimited number of pilgrims every day. With the support of donors, today there is no dearth for vegetables also. The pilgrims are being served with tasty menu at regular intervals in complex, compartments, queue lines etc. in Tirumala”, he maintained.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడిలో అన్నప్రసాద వితరణకు 33 ఏళ్లు పూర్తి : జెఈవో

ఏప్రిల్‌ 06, తిరుమల 2018: టిటిడి అన్నప్రసాద వితరణను ప్రారంభించి 33 ఏళ్లు పూర్తయిందని, భక్తులు విరాళాలు అందించడం ద్వారా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.937 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు ప్రారంభించారని జెఈవో తెలిపారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 1.45 లక్షలు, రద్దీ రోజుల్లో 1.90 లక్షలు, ప్రత్యేక పర్వదినాల్లో 3 లక్షల అన్నప్రసాదాలను(సర్వింగ్స్‌) భక్తులకు అందిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా సాధారణ రోజుల్లో 8 టన్నులు, రద్దీ రోజుల్లో 10 టన్నులు, ప్రత్యేక పర్వదినాల్లో 12 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నామని, వీటిని దాతలు విరాళంగా అందిస్తున్నారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లు విరాళంగా అందినట్టు తెలిపారు. భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్న అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని కంపార్ట్‌మెంట్లలో ఉప్మా, పొంగళ్‌తోపాటు చట్ని కూడా అందించాలని ఈవో ఆదేశించారని తెలిపారు. పది రోజుల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని జెఈవో వివరించారు.

భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల సంఖ్య రెట్టింపు :

భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు తిరుమలలో ప్రస్తుతమున్న మరుగుదొడ్లను రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జెఈవో తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ నిర్వహణ వ్యవస్థను ఈ మరుగుదొడ్ల వద్ద ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీజిఎల్‌ఎన్‌.శాస్త్రి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.