SWAMY PUSHKARINI TO RE-OPEN FROM SEPT.15 _ శ్రీవారి భక్తులకు ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి

TIRUMALA, SEPT 14:  The holy temple tank of Swamy Pushkarini located adjacent to Srivari temple in Tirumala is all set ready for the usage of the pilgrims with its new look from Sunday onwards. 
 
As a part of the routine activity every year a month prior to Sri vari annual brahmotsavams, TTD has taken up the Swamy Pushkarini facelift works on August 16. Tirumala JEO Sri KS Sreenivasa Raju personally monitored the repair works every day. The old waters, silt has been removed from the holy temple tank and refilled with one crore litres of purified water. About 100 workers worked day and night to give a new look to the holy tank as per the instructions of Water Works EE Sri A Narasimha Murthy and continuous supervision by Dy EE Sri Gopalakrishna Reddy and AE Sri Chandrasekhar. The walls and steps inside the pushkarini have been painted in gold to give an attractive look to Swamy Pushkarini. TTD halted the daily Puskarini harati due to the cleaning and purification works of the temple tank for about a month. The entry of pilgrims into Swamy Pushkarini has also been temporarily halted by TTD in the wake of renovation works.
 
However with the completion of works, TTD has restored Pushkarini Harati on Saturday evening. The pilgrims will be allowed to take holy bath in the temple tank from Sunday onwards.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి భక్తులకు ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి

తిరుమల, 14  సెప్టెంబరు 2013 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణిలోనికి ఆదివారం నుండి శ్రీవారి భక్తులను తి.తి.దే అనుమతించనుంది.

కాగా ఈ మరమత్తు పనులు తి.తి.దే గతనెల 16వ తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్‌) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు.

అయితే గత నెల స్వామి పుష్కరిణి మరమత్తుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని తి.తి.దే నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒకనెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. అయితే స్వామి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తి అయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తి.తి.దే అధికారులు పుష్కరిణి హారతిని పునరుద్దరించనున్నారు. సెప్టంబర్‌ 15 నుండి భక్తులను కూడా పుష్కరిణిలోనికి అనుమతించనున్నారు. కాగా స్వామి పుష్కరిణి మరమత్తు పనులను తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు ప్రత్యేక పర్యవేక్షణలో వాటర్‌వర్క్స్‌ ఇ.ఇ. శ్రీ ఎ.నరసింహమూర్తి, డిప్యూటి.ఇ.ఇ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఏ.ఇ చంథ్రేఖర్‌లు సమర్థవంతంగా మరమత్తు పనులను పూర్తిచేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.