Three Day Annual Avatharotsavam of Sri Sundaraja Swamy begins _ ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
ఘనంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2012 జూలై 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి కన్నులపండువగా కళ్యాణోత్సవం జరిగింది. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందర రాజస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.