TIRUCHANOOR ANNUAL BRAHMOTSAVAMS FROM NOVEMBER 30 TO DECEMBER 8 _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
Tirupati, 26 October 2021: The annual Karthika Brahmotsavams at Tiruchanoor will be observed from November 30 till December 08 in the famous shrine of Goddess Sri Padmavathi Devi.
In view of the Covid pandemic, this nine-day mega religious festival will be observed in Ekantam in Vahana Mandapam at Tiruchanoor.
Laksha Kumkumarchana will be performed on November 29 with Ankurarpanam on the same day evening. While the Koil Alwar Tirumanjanam will be observed on November 23.
The important days include Dhwajarohanam on November 30, Gaja Vahanam on December 4, Garuda Vahanam on December 5, while Sarvabhoopala Vahanam will be observed in the place of Swarnaratham and Wooden Chariot processions on December 5 and December 7 respectively, Panchami Theertham and Dhwaja Avarohanam on December 8.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 26 అక్టోబర్ 2021 ;సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో
వాహన మండపంలో ఏకాంతంగా జరుగనున్నాయి.
ఇందుకోసం నవంబరు 29వ తేదీ ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
30-11-2021 ధ్వజారోహణం చిన్నశేషవాహనం
01-12-2021 పెద్దశేషవాహనం హంసవాహనం
02-12-2021 ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
03-12-2021 కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
04-12-2021 పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం, గజవాహనం
05-12-2021 సర్వభూపాల వాహనం – సాయంత్రం స్వర్ణరథం బదులు సర్వభూపాలవాహనం, రాత్రి -గరుడవాహనం
06-12-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-12-2021 రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం – అశ్వ వాహనం
08-12-2021 పంచమితీర్థం(వాహనమండపంలో) – ధ్వజావరోహణం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.