TIRUMALA JEO REVIEWS ON SSD _ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లపై తిరుమల జెఈవో సమీక్ష

Tirupati, 2 May 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Wednesday evening reviewed on Slotted Sarva Darshan (SSD) counters.

The review meeting took place in the IT conference hall in TTD Administrative Building in Tirupati along with TTD IT and TCS officials.

He said, TTD has commenced a total of 109 SSD counters in Tirupati, Tirumala and in footpath routes for the benefit of the pilgrims.

Additional CVSO Sri Siva Kumar Reddy, SE I Sri M Ramesh Reddy, GM and IT wing chief Sri Sesha Reddy, Temple DyEO Sri Harindranath and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లపై తిరుమల జెఈవో సమీక్ష

మే 02, తిరుపతి, 2018 ;సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఐటి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులు నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. ఇందుకోసం తిరుమల, తిరుపతి, కాలినడక మార్గాల్లో మొత్తం 109 కౌంటర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

ఈ సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీశేషారెడ్డి, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి శ్రీ సుధాకర్‌, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర టిటిడి, టిసిఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.