TIRUPATI JEO RELEASES BTU 2017 CULTURAL BOOKLET_ శ్రీవారి బ్రహ్మూెత్సవాల ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల బుక్‌లెట్ ఆవిష్కరణ
Tirupati, 19 September 2017: The Tirupati JEO Sri Pola Bhaskar today released the cultural and bhakti programs booklet for the ensuring Brahmotsavam-2017 commencing from Sept 23 to Oct 1.
Addressing the event at TTD Admin bldgs. in the presence of HDPP secretary Sri Ramakrishna Reddy, the JEO said all arrangements were in place for performance of bhakti and cultural programs for benefit of devotees coming for the Brahmotsavam-2017.
He said the Hindu Dharma Prachara Parishad, Annamacharya project, Dasa Sahitya, Alwar Divya Prabandam project, Sri Venkateswara Bhakti Channel, Sri Venkateswara Music and Dance College, Sri Venkateswara Veda pathashala, would conduct the programs jointly.
While the Nada Niranjanam, Asthana Mandapam at Tirumala and Mahati auditorium, Annamacharya Kala mandir, Ramachandra pushkarini at Tirupati will become platforms for all dharmic and cultural bhakti programs. He said learned Vedic experts would render commentary for all the Vahana sevas being conducted on the Mada Streets.
The booklet comprised of the list of programs and also names of prominent artists who performed both at Tirumala and Tirupati in morning and evening hours
ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి బ్రహ్మూెత్సవాల ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల బుక్‌లెట్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 19, తిరుపతి, 2017 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని తిరుమల, తిరుపతిలో పలు వేదికలపై నిర్వహించనున్న ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల బుక్‌లెట్‌ను మంగళవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మూెత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టులు, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర వేద పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. తిరుమలలో నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మూెత్సవాల వాహనసేవల్లో నిష్ణాతులైన పండితులతో వ్యాఖ్యానం అందిస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
తిరుమలలో..
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 5.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ధర్మగిరిలోని ఎస్వీ వేదపాఠశాల ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం, ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు విష్ణుసహస్రనామం, ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు ధార్మికోపన్యాసం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు నామసంకీర్తన/నృత్యం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
నాదనీరాజనం వేదికపై చెన్నైకి చెందిన ప్రముఖ గాయకురాలు శ్రీమతి సవితా శ్రీరామ్, దక్షిణాఫ్రికాకు చెందిన భరతనాట్య కళాకారులు శ్రీమతి వృషిక పాతర్, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గాయకులు శ్రీ జెఎస్.ఈశ్వర్‌ప్రసాద్, కలకత్తాకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి తంగమని కుట్టి లాంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలిస్తారు.
తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.
తిరుపతిలో..
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ధార్మికోపన్యాస కార్యక్రమాలు జరుగనున్నాయి. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.