TIRUPPAVAI PRAVACHANAMS AT TIRUMALA FROM DECEMBER 17 _ డిసెంబరు 17 నుండి తిరుమ‌ల‌లో తిరుప్పావై పారాయ‌ణం

Tirumala,16 December 2023: As part of the auspicious Dhanurmasa tradition, Tiruppavai Pasura Pravachanams will begin at Tirumala Pontiff Sri Sri Sri Pedda jeeyarswamy mutt between 7am and 8am on December 17.

 

The SVBC channel will live telecast the Tiruppavai Pravachanams for the benefit of devotees across the world.

 

Similarly, Vedic Scholar Dr Govardhan Swaminathacharyulu wil render the Tiruppavai Pravachanams at Asthana Mandapam in Tirumala between  8am and 9am daily during the entire Dhanurmasa.

 

Tiruppavai in place of Suprabatha Seva at Srivari temple 

 

One of the most important festivities in Sri Vaishnava temples, the sacred Dhanurmasam commences from 12.34 hours of December 16 midnight (December 17) as per Hindu calendar.

        

In this backdrop Tiruppavai  Seva will be performed every day in the place of Suprabatha Seva till the end of  Dhanurmasa on January 14 in 2024.

Devotees are requested to note that there would be no Suprabatha Seva till the period.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 17 నుండి తిరుమ‌ల‌లో తిరుప్పావై పారాయ‌ణం

తిరుమల, 2023 డిసెంబరు 16: తిరుమల, 2023 డిసెంబరు 16పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా డిసెంబరు 17న ఆదివారం నుండి 2024 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌ స్వామి మ‌ఠంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదేవిధంగా తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో హైద‌రాబాదుకు చెందిన వేదాంత విద్వాంసులు డా. గోవ‌ర్ధ‌నం స్వామినాథాచార్యులు నెల రోజుల పాటు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చేస్తారు.

సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘ‌డియ‌లు డిసెంబ‌రు 17వ తేదీ తెల్లవారుజామున 12.34 గంటలకు ప్రారంభమ‌వుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. అప్ప‌టివ‌ర‌కు సుప్ర‌భాతం సేవ ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

————————————————————-
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.