TRADITIONAL FOLK ARTS LURE DEVOTEES DURING SRI PAT

DEVARATTAM AND OYILATTTAM STEAL THE LIMELIGHT

Tiruchanur, 18 November 2017: The traditional folk artistes from Tamilnadu and Karnataka lured devotees with their expertise on the fourth day of the ongoing nine-day annual brahmotsavams in Tiruchanoor on Saturday.The Devarattam-Dance by Deities is one of the oldest folk dance forms of Tamilnadu which was presented before Kalpavriksha Vahana Seva.

While Oyilattam is yet another traditional dance art originated from Madurai, Tiruchirapalli and Tirunelveli districts of Tamilnadu with a typical, musical accompaniment “Thavil” and the performers have coloured handkerchiefs tied to their fingers and wear ankle bells and rhythmically dance.

The other interesting arts included Bomma Gurralu, Kali Attam, Kavadi Attam, Nemali Nrutyam, Kokkali Attam which added additional flavour to the grandeur of Ammavari Brahmotsavams.

Similarly, about 60 artists from Karnataka presented Dollu Kunita, PataKunita, Purushaveera Gase etc, dance forms in front of Vahanam grabbing the attention of devotees.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనసేవలో అలరించిన జానపద కళాప్రదర్శనలు

తిరుపతి‌, 18 నవంబ‌రు 2017 ; శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కు చెందిన కళాకారుల జానపద కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఈ ప్రదర్శనలు కళ్ళకు కట్టాయి. జానపద బాణీలో సాగిన ఈ ప్రదర్శనల్లో ఖడ్గాలు, శూలాలు లాంటి ఆయుధాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వాయిద్యాలైన డప్పు, తప్పెట్లు, తాళాలు, డ్రమ్ములు తదితరాలను వినియోగించారు. పలువురు కళాకారులు వివిధ దేవతామూర్తులు, రాక్షసుల వేషధారణలో ఆకట్టుకున్నారు.

తమిళనాడు నుంచి 60 మంది కళాకారులు వచ్చారు. వీరు తప్పట్టం, దేవరట్టం, బొమ్మగుర్రాల నృత్యం, నెమలి నృత్యం, ఒయిల్ అట్టం, కావడి అట్టం, నంది నృత్యం, నాయాండి మేళం, కాళి అట్టం, కొక్కలి కట్ట అట్టం కళాప్రదర్శనలు ఇచ్చారు.

అదేవిధంగా కర్ణాటక నుంచి 60 మంది కళాకారులు వచ్చారు. వీరు డొల్లు కుణిత, పాట కుణిత, పూజాకుణిత, మహిళా టమెటె, మహిళా వీరగాసె, పురుష వీరగాసె కళాప్రదర్శనలు ఇచ్చారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌డ‌మైన‌ది.