TRISHULA SNANAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

Tirupati, 15 February 2018: The grand conduction of Trishula Snanam marked the completion of the celestial Brahmotsavam at Sri Kapileswara Swamy Temple.

Earlier the ustava idol of Sri Nataraja Swamy rode on Surya Prabha Vahanam up to Anna Rao circle to the accompaniment of drums, bhakti music and camphor haratis by the devotees. The temple priests performed Snapana Thirumanjanam to the utsava deities and later Purnahuti, Kalasodhwasanam, and Kalashabhisekam to the Mural virat.

The Dwaja Avarohanm event in the evening will mark the conclusion of the annual brahmotsavam of Sri Kapileswara swamy.

The Lord Kapila will ride on Ravana Vahanam at night marking the special rituals and prayers to the Lord of rakshashas who was also a staunch devotee of Shiva.

TTD local temples Dy EO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

ఫిబ్రవరి 15, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీనటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అన్నారావు సర్కిల్‌ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.

అనంతరం ఉదయం 11 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.

హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకర రాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.