TTD AYURVEDA HOSPITAL, A ROLE MODEL FOR COUNTRY_ శ్రీవారి భక్తులకు ఆయుర్వేద వైద్యం :ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాల సూపరింటెండెంట్‌ డా|| పార్వతి

Tirumala, 28 September2017: TTD’s exemplary foray to popularize Ayurveda medicine has found its mark in the Ayurveda hospital and pharmacy, says Dr Parvati, supdt of Ayurdeva hospital.

She said over 4000 devotees had taken Ayurveda medicine during the Brahmotsavam-2017 so far for all ailments. ‘The TTD Ayurveda pharmacy produced several formulas from the medicinal plants grown in its plantations’ she said.

She said Sri Venkateswara Ayurveda College Hospital would be developed into a model Ayurveda institute in the entire country, Thee TTD Ayurvedic pharmacy at Narasingapuram, Ayurveda medicinal plants are grown, is being developed on a much larger scale to supply of medicinal plants to other institutes and also to identify more number of such species.

She said the Ayurvedic hospital, affiliated to the college, is one of its kind in the State with 210 beds.offering free treatment to the needy. More than 1.4 lakh patients were treated in 2016 and during the current Brahmotsavams nearly 4000 pilgrims took ayurveda medicines at Tirumala.

She said Medicines worth Rs. 80 lakh are prepared every year at the pharmacy, and they are distributed free of cost at the hospital as well as auxiliary clinics at Tirumala and Srinivasam complex. In addition, medicines are supplied to the needy during camps organised in various parts of the country. The last such camp was held during the Godavari Pushkaralu. TTD is spending over Rs.10 crore on promoting Ayurveda medicine among people as a better alternative for the allopathy, she says.


ISSUED BY PUBLIC RELATIONS DEPARTMENT,TTDs,TIRUPATI

శ్రీవారి భక్తులకు ఆయుర్వేద వైద్యం :ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాల సూపరింటెండెంట్‌ డా|| పార్వతి

తిరుమల, 28 సెప్టెంబరు 2017: ఎస్‌.వి ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్‌్‌ డా|| పార్వతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి అందిస్తున్న ఆయుర్వేద వైద్యనికి భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కల్యాణవేదిక చెంత ”బ్రహ్మోత్సవ మహా ప్రదర్శన” లో ఏర్పాటుచేసిన ఆయుర్వేద ప్రదర్శనకు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఇందులో ఔషధగుణాలున్న మొక్కలను, వాటిని ఏవిధంగా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలని సవివరంగా ఏర్పాటుచేశామని వివరించారు.

అదే విధంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సిఆర్‌వో, లేపాక్షి దగ్గర ప్రథ మ చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతిరోజు దాదాపు 1000 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటి ఇప్పటివరకు 5300 మంది భక్తులకు ఆయుర్వేద చికిత్స అందించామన్నారు.

భారతీయ వేదాల నుండి ఉద్భావించిందే ఆయుర్వేదమని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గత 22 సంవత్సరాలుగా ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తునట్లు తెలియజేశారు. చతుర్వేదాలలోని అధర్వణవేదం యొక్క ఉపాంగము ఆయుర్వేదం అని వివరించారు.

శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేదిక్‌ కళాశాలలో 14 డిపార్టుమెంట్లలో షుగరు, బి.పి లాంటి దీర్ఘకాల రోగాలకు సంబంధించి ఆయుర్వేద మందుల ద్వారా నయం చేయడానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పంచకర్మ చికిత్స విధానం ద్వారా 5 రకాల మలినాలను శరీరం నుండి తొలగించడం ద్వారా అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే ప్రజాసంబంధాల ఆధికారి డా|| టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.