TTD CHAIRMAN COUPLE PRESENT PATTU VASTRAMS TO KANPAKA VINAYAKA _ కాణిపాకం వినాయకుడికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఛైర్మన్ దంపతులు
Tirupati, 18 Sep. 21: TTD Chairman Sri YV Subba Reddy along with his spouse Smt Swarnalatha presented pattu vastrams to Sri Varasiddhi Vinayaka Swamy temple at Kanipakam in connection with the ongoing annual Brahmotsavams.
The TTD Chairman and AP Deputy CM Sri Narayana Swami, MLA Sri MS Babu, RTC Regional Chairman Sri Vijayananda Reddy were received with traditional honours by the Kanipaka temple EO Sri Venkatesu.
Both the Chairmen of TTD and RTC traditionally carried Pattu vastrams and garlands on their head adorned with Parivattam.
Amidst chanting of Veda Mantras, they presented Vastrams to Sri Vinayaka Swamy and had Darshan of the presiding deity.
The temple Archakas rendered Veda Asirvachanam and later the temple EO presented Thirtha Prasadams and a portrait of the chief deity.
CHAIRMAN INSPECTS BANGARU CHARIOT
The TTD Chairman also inspected the Golden Chariot at Kanipaka Sri Varasiddi Vinayaka Swami made under the supervision of TTD for which TTD had contributed ₹6 crores and some gold.
Speaking to media persons later the TTD chairman said the Golden Ratham works were delayed due to Covid.
He said he prayed for relief to humanity from Covid and appealed to devotees to observe all Covid guidelines.
The Chairman said TTD had decided to conduct the annual Srivari Brahmotsavam in Ekantam this year also in view of Covid alerts by the State and Central Governments.
Responding to a question he said the government would announce board members to all other temples in the state within 10 days.
TTD EE Sri Sivrama Krishna, TTD Sthapathi Sri Muniswami Reddy, AEO Sri Murali, Kanipaka Temple officials and Archakas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కాణిపాకం వినాయకుడికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఛైర్మన్ దంపతులు
తిరుపతి 18 సెప్టెంబరు 2021: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న శ్రీ సుబ్బారెడ్డి కి డిప్యూటీ సిఎం శ్రీ నారాయణ స్వామి, శాసన సభ్యులు శ్రీ ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో శ్రీ వెంకటేసు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఆలయ ఈవో కు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో
శ్రీ వెంకటేసు టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు.
బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు.
టీటీడీ ఈఈ శ్రీ శివరామ కృష్ణ, ఎఈవో శ్రీ మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి, కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది