TTD CHAIRMAN INSPECTS DEVOTEE FACILITATION FOR V DAY AT TIRUMALA _ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 5 January 2020: TTD Chairman Sri YV Subba Reddy along with the Honourable Endowments Minister Sri Vellampall Srinivas conducted an inspection of VQC-2 and sheds of Narayanagiri Gardens specially made for Vaikunta Ekadasi and Dwadasi at Tirumala.

The TTD Board Chief interacted with the devotees in queue lines who expressed their immense satisfaction over the arrangements.

Later he told media persons that a record number of 90,000 devotees had queued up at Tirumala and that TTD officials had made all arrangements for drinking water, Anna Prasadam, coffee, tea etc. for them.

He said a large posse of TTD officials, Srivari Sevakulu, scouts and police were rendering stellar services to pilgrims.

He appealed to devotees to patiently beget Vaikunta dwara darshan and blessings of Lord Venkateswara.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 05 జ‌న‌వ‌రి 2020: తిరుమ‌ల‌లో సోమ‌వారం వైకుంఠ ఏకాద‌శి, మంగ‌ళ‌వారం ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా విశేషంగా విచ్చేసిన భ‌క్తుల‌కు క‌ల్పించిన సౌక‌ర్యాల‌ను ఆదివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కూడా ఉన్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరిలోని షెడ్ల‌ను త‌నిఖీ చేశారు. టిటిడి క‌ల్పించిన సౌక‌ర్యాల‌పై అక్క‌డ వేచి ఉన్న భక్తుల‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టికే సుమారు 90 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు పంపిణీ చేస్తున్నామ‌ని, త‌గిన‌న్ని మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌ని వివ‌రించారు. భ‌క్తుల‌కు టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు, స్కౌట్లు, పోలీసులు చ‌క్క‌గా సేవ‌లందిస్తున్నార‌ని కొనియాడారు. కంపార్ట్‌మెంట్లు, షెడ్ల‌లో వేచి ఉన్న భ‌క్తులు సంయ‌మ‌నం పాటించి టిటిడి అధికారుల‌కు స‌హ‌క‌రించి సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.