TTD FOCUS ON COMMON DEVOTEES DURING BRAHMOTSAVAMS- YV SUBBA REDDY_ శ్రీవారి వైభవాన్ని మరింత విస్తృతంగా భక్తులకు అందించండి : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirumala, 30 Sep. 19: All arrangements have been made to ensure devotees a comfortable stay and darshan at Tirumala during the annual Brahmotsavams, said TTD Trust Board Chief Sri YV Subba Reddy.

Inaugurating the Media Center at the  Ram Bagicha Rest House II in Tirumala on Monday, the Chairman said the purpose of the media Center is to propagate the glory of Lord Venkateswara and the grandeur of Brahmotsavams across the world.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Gopinath Jetty, Additional CVSO Sri TV Siva Kumar Reddy, Board Member K Siva Kumar, VGO  Manohar and PRO Dr. T Ravi participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీవారి వైభవాన్ని మరింత విస్తృతంగా భక్తులకు అందించండి : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.

తిరుమలలో మీడియా సెంటర్ ను ప్రారంభించిన చైర్మెన్
 

తిరుమల, 2019 సెప్టెంబర్ 30:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వైభవాన్ని  ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విస్తృతంగా చేరవేయాలని మీడియా ప్రతినిధులను టిటిడి ఛైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కోరారు. తిరుమలలోని రాంభగీచా – 2 విశ్రాంతి గృహంలో టిటిడి అదనపు ఈవో శ్రీఏవీ ధర్మారెడ్డితో కలిసి మీడియా సెంటర్ ను  సోమవారం ఉదయం  టిటిడి ఛైర్మెన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విరివిగా అందించాలని కోరారు.
         

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలియజేశారు. ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన ఈ అవకాశంతో ఎలాంటి లోపాలు లేకుండా, విలువలు కాపాడుతూ సేవకుడిగా సేవలందిస్తానని తెలిపారు.

శ్రీవారి వాహనసేవలు, నిత్యకైంకర్యాలు, తిరుమలతోపాటు తిరుపతిలోని పలు వేదికలపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాచారానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు, పత్రికా ప్రకటనలు, ఫోటోలను అందిస్తారన్నారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ప్రతిరోజు మీడియా సెంటర్ లో అధికారులు తెలియజేస్తారన్నారు.  మీడియా ప్రతినిధుల సౌలభ్యం కోసం మీడియా సెంటర్ లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫ్యాక్స్, టివి, పత్రికలు, టెలిఫోన్ వసతి కల్పించామన్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తామన్నారు.    
           

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ కె.శివకుమార్, శ్రీ ఎం. రాములు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ శెట్టి, సిఈ శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విజీవో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.          

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.