TTD HUNDI REVENUE INCREASES IN MARCH_ మార్చిలో హుండీ ఆదాయం రూ.95.94 కోట్లు

Tirumala, 6 April 2018: The Srivari Hundi recorded Rs.95.94cr revenue in the month of March which is Rs.9.44 cr more than last year’s, said TTD EO Sri Anil Kumar Singhal.

The EO also briefed media that in last March 21.32lakh pilgrims had darshan while this year 21.24lakh had darshan of Lord Venkateswara in March. The number of laddus distributed this March stood at 92.99lakhs, 49.09 lakh pilgrims had Annaprasadam while 29.98lakh pilgrims had beverages. About 8.65lakh pilgrims had offered their hair.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చిలో హుండీ ఆదాయం రూ.95.94 కోట్లు

ఏప్రిల్‌ 06, తిరుమల 2018: ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.95.94 కోట్లు లభించినట్టు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గతేడాది మార్చిలో హుండీ ఆదాయం రూ.86.50 కోట్లు లభించిందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈవో ఈ వివరాలను తెలియజేశారు.

గతేడాది మార్చిలో 21.32 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది మార్చిలో 21.24 లక్షల మంది దర్శించుకున్నారు. గతేడాది మార్చిలో 81.60 లక్షల లడ్డూలను భక్తులకు అందించగా, ఈ ఏడాది మార్చిలో 92.99 లక్షల లడ్డూలను అందించడం జరిగింది. గతేడాది మార్చిలో 44.56 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా, ఈ ఏడాది మార్చిలో 49.09 లక్షల మందికి అందించారు. గతేడాది మార్చిలో 29.98 లక్షల మందికి పానీయాలు అందించగా, ఈ ఏడాది మార్చిలో 32.13 లక్షల మందికి అందించారు. గతేడాది మార్చిలో 8.89 లక్షల మంది తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది మార్చిలో 8.65 లక్షల మంది సమర్పించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.