TTD LOCAL TEMPLES SHUT ON LUNAR ECLIPSE DAY _ నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Tirupati,6, November 2022: TTD announced on Sunday that the TTD local temples also remain closed for 11 hours between 08.30 am to 7.30 pm on November 8th in view of the Lunar eclipse.

TTD said it was a tradition to close temples six hours ahead of an eclipse as the lunar eclipse occurred between 2.39 pm to 6.27 pm and reopened after temple shuddi and other Kainkaryas.

These activities will be performed at Sri Padmavati temple, Tiruchanoor, Sri Govindaraja Swamy temple, Sri Kodandaramaswami temple and Sri Kalyana Venkateshwara Swamy temple, Srinivasa Mangapuram.

However, at the Sri Kapileswara temple, Sarva Darshan for devotees will be allowed at 8.00 pm followed by abhisekam, special alankaram, Sahasra namarchana, nivedana and Deeparadhana before Ekantha Seva at 10.00 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

తిరుపతి, 2022 నవంబరు 06: చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 గంట‌ల‌ నుండి రాత్రి 7.30 గంటల వరకు టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేస్తారు. స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాలని కోర‌డ‌మైన‌ది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఈ మేరకు ఆలయ కార్యక్రమాలు జరుగుతాయి.

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అలంకారం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నివేద‌న‌, దీపారాధ‌న‌, రాత్రి 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.