TTD TEMPLES GEAR UP TO OBSERVE VINAYAKA CHAVITHI_ టిటిడి ఆధ్వర్యంలో వినాయక చవితికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 24 August 2017: The Lord Ganesha temples located in both the Ghat Roads, in Kapila Teertham gear up for Vinayaka Chaturdi fete on Friday.

Painting, whitewashing, rangolis, were completed and the temples are decorated with mango leaves, pandals and flowers of various types.

TTD transport wing will observe special puja to first ghat Vinayaka while special abhishekams will be rendered to the presiding deties at Second ghat and Kapilateertham Vinayaka temples.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ఆధ్వర్యంలో వినాయక చవితికి ఏర్పాట్లు పూర్తి

ఆగస్టు 24, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో :

టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయక స్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలోనూ వినాయక చవితి సందర్భంగా మూలవర్లకు అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.