TTD TO PERFORM RADHA YATRAS AND GOVINDA KALYANAMS IN NOVEMBER AND DECEMBER – TTD JEO N.YUVRAJ _ నవంబర్ 18 నుండి డిశెంబర్ 30వ తేది వరకు లోక కల్యాణ రథయాత్రలు, శ్రీ గోవింద కల్యాణాలు – జెఈవో శ్రీ యువరాజ్
నవంబర్ 18 నుండి డిశెంబర్ 30వ తేది వరకు లోక కల్యాణ రథయాత్రలు, శ్రీ గోవింద కల్యాణాలు – జెఈవో శ్రీ యువరాజ్
తిరుపతి, 2010 నవంబర్-11: వరంగల్ జిల్లాలో నవంబర్ 18వ తేది నుండి డిశెంబర్ 12వ తేది వరకు లోక కల్యాణ రథయాత్రలు, అదేవిధంగా నవంబర్ 18వ తేది నుండి 30వ తేది వరకు శ్రీ గోవింద కల్యాణాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్ యన్.యువరాజ్ చెప్పారు. గురువారం ఉదయం స్థానిక పద్మావతి అతిథిగృహంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ నవంబర్ 18 నుండి 24 వరకు వరంగల్ జిల్లాలోని మహబూబ్‌బాద్‌లోను, నవంబర్ 27 నుండి డిశెంబర్ 3 వరకు పరకాలలో, డిశెంబర్ 6 నుండి 12 వరకు జనగాంలలో ఈ లోక కల్యాణరథాలు వుండేటట్లు ఏర్పాట్లు చేయాలని ఆయన ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా ఏడు రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో ఈ రథం వుంటుంది. గనుక ఆయారోజులలో స్నపన తిరుమంజనం, గ్రామయాత్ర, స్త్రీలచే కుంకుమపూజ, సహస్రదీపాలంకారసేవ, జపయజ్ఞం, భజన యజ్ఞ, కల్యాణోత్సవాలు నిర్వహించాల్సిందిగా ఆయన డిపిపి కార్యదర్శిని ఆదేశించారు.
అదేవిధంగా నాల్గవ విడత శ్రీగోవింద కల్యాణాలను వరంగల్ జిల్లాలో నవంబర్ 18వ తేదిన మంగపేట, 20వ తేదిన రాజుపేట, 21న చల్వాయి 23న ఏలూరు నాగారం, 24న నార్లాపూర్, 25న జాకారం, 26న కొత్తగూడ, 28న ఖానాపూర్, 30వ తేదిన గూడూరులలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మేడసాని మోహన్‌ను ఆదేశించారు. లోక కల్యాణ రథాలు, శ్రీగోవింద కల్యాణాలు నిర్వహించే ప్రాంతంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఆయుర్వేద యునాని, జనరల్ మెడిసిన్ మందులను భక్తులకు ఉచితంగా అందజేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన ముఖ్య వైద్యాధికారిని ఆదేశించారు. వీటితోపాటు పుస్తక విక్రయశాలలను ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక గ్రంధాలతోపాటు, సిడీలను అందుబాటులో వుంచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో తితిదే ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్, డిపిపి కార్యదర్శి డాక్టర్ కవితాప్రసాద్, ఛీఫ్ ఇంజనీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
TIRUPATI, NOVEMBER 11: TTD Joint EO, Sri N.Yuvaraj said, as a part of
Tirumala Tirupati Devasthanams(TTD) chief motto of propagating Hindu
Sanatana Dharma, the temple management has all set to organise Loka
Kalyana Rath Yatras and Govinda Kalyanams in the months of November
and December in Warangal.
In a review meeting with TTD officials at Sri Padmavathi Guest House
in Tirupati on Thursday, the JEO said the Rath Yatras will be taken up
in Warangal from November 18 to December 12 while the Govinda
Kalyanams will be conducted from November 18 to 30.
Further elaborating the scheduled programmes, he said, the rath
yatras will be held for seven days each at Mehaboobabad from November
18 to November 24, from November 27 to December 3 in Parakala and from
December 6 to 12 in Janagam of Warangal district.
He also directed the Hindu Dharma Prachara Parishad(HDPP) secretary,
Dr.R.Kavitha Prasad, to perform other rituals that are being performed
in Tirumala temple like, Snapana Tirumanjanam, Kumkum puja by women
devotees, Sahasradeepalankara Seva, Bhajans, Kalyanotsavams etc.
The JEO said fourth phase Sri Govinda Kalyanams will also be
performed in different places at Warangal. These celestial kalyanams
will take place at Mangapet on November 18, Rajupet on November 20,
Chalwayi on November 21, Eturunagaram on November 23, at Narlapur on
November 24, at Jakaram on November 25, Kothaguda on November 26,
Khanapur on Novmeber 28 and on November 30th at Gudur and directed the
Annamacharya Project Director Sri Medasani Mohan to make all necessary
arrangements for the same.
He asked health department officials to organise health camps in all
these areas where the kalyanams will be performed.
TTD CV&SO Sri MK Singh, HDPP secretary Sri R.Kavitha Prasad,
Annamacharya Project Director Sri Medasani Mohan, CMO Sri Prabhakar,
chief engineer Sri Chandra Sekhar Reddy were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD