TTD TRUST BOARD MEETING HELD _ ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

DONATIONS POUR IN FOR TTD 

 

TIRUMALA, 30 APRIL 2022: The TTD Trust Board meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday under the Chairmanship of Sri YV Subba Reddy with Dr KS Jawahar Reddy (EO), Sri AK Singhal (Principal Secretary Endowments), Sri Harijawaharlal (Commissioner Endowments), Dr C Bhaskar Reddy (TUDA Chairman) and other board members and TTD top brass authorities.

 

The board has taken some important decisions in the larger interests of pilgrims and also some employee-friendly decisions.

 

Besides, donations are also poured in for TTD to take up various development activities including spiritual and Medicare.

 

The TTD Board Chief informed the media about the highlights in the press meet. Some excerpts. 

 

@ Rs.500 crores worth 10acres of land has been donated to TTD by the Maharashtra Government at Navi Mumbai towards the construction of Sri Venkateswara temple. The Chairman said, the construction of a temple in a spacious area has been awaited for the past eight years and the historical moment is going to become a reality soon.

 

@ Raymond company MD Sri Goutam Singhania has come forward to donate the construction cost of the temple (approximately Rs.60cr)

 

@ The services of Srivari Mettu footpath route will be resumed from May 5 onwards.

 

@ TTD Board has also given a nod to resume Divya Darshan (pedestrian darshan) soon after the peak summer season.

 

@ The board has approved to make applicable all the donation privileges ranging between Rs.1lakh and Rs.1crore even to kind donations on par with that of cash donors. 

 

@ Approval of 100crore allocation to Tirupati Smart City Corporation towards the second phase of works of Srinivasa Sethu, which is scheduled to complete by March 2023.

 

@ New E&F blocks to be built at Sri Padmavati medical college at a cost of 21.20 crore.

 

@ Towards the laying of RCC roads and Crash Barriers along the Ghat Roads, in first phase, TTD board has approved for Rs.20 crores and another Rs.15 crores during the second phase.

 

@ For renovation and repairs of staff quarters, the board has sanctioned Rs.19 crores 

 

@ Approval given to call for tenders towards gold lacing of two new thrones at Srivari temple at cost of 3.61 crore.

 

@ 2.86 acres of land allocated for parking electric buses at Balaji Nagar area in Tirumala.

 

@  Approval for setting up bio-gas plant using wet garbage in Tirumala with Indian Oil corporation collaboration.

 

@ Appointment of Tangirala Venkata Krishna Purna Prasad as TTD Asthana Siddhanti for the year 2022-23.

 

@ Approval to accept a donation of 58 lakhs worth house at Pondicherry belonging to Smt R Karnavati of Chennai.

 

Board members, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimham Kishore and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

భ‌క్తులకు మ‌రింత వేగంగా, సౌక‌ర్య‌వంతంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం

– మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి రూ.500 కోట్ల విలువైన భూమి విరాళం

– శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు

– టీటీడీ చైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2022 ఏప్రిల్ 30: టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న శ‌నివారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు స‌మావేశం జరిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీలోని అన్నివిభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌రువాత అధిక సంఖ్య‌లో తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం స‌ర్వ దర్శనం, టైం స్లాటెడ్ దర్శనాలు కొనసాగిస్తామ‌న్నారు. న‌డ‌క దారి భ‌క్తుల‌కు త్వ‌ర‌లో టోకెన్లు జారీని ప్రారంభిస్తామ‌న్నారు.

ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

– మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన 10 ఎక‌రాల భూమిని విరాళంగా ఇచ్చింద‌న్నారు.

– అక్క‌డ‌ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్లు విరాళమిచ్చేందుకు దాత రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకొచ్చార‌న్నారు.

– ప్ర‌స్తుతం ముంబై న‌గ‌రంలో శ్రీ‌వారి ఆల‌యం కేవ‌లం వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఇరుకైన ప్రాంతంలో రెండు ద‌శ‌బ్ధాలుగా ఉంద‌న్నారు. అటువంటిది ఇంత విశాల‌మైన ప్రాంగ‌ణంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మాణం జ‌ర‌గ‌డం చారిత్ర‌త్మ‌క‌మైనద‌న్నారు.

– గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న శ్రీ‌వారి మెట్టు మార్గాన్ని పునఃరుద్ధ‌రించి మే 5వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తాం.

– తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలు లకు బంగారు పూత పోయ‌డానికి రూపాయలు 3.61 కోట్లతో టెండర్ల ద్వారా చేయుట‌కు అనుమ‌తి మంజూరు.

– శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో రూపాయలు 21.20 కోట్లతో ఇ మ‌రియు ఎఫ్ బ్లాకుల నిర్మాణానికి నిర్ణ‌యం.

– ఐఐటి నిపుణుల సూచ‌న‌ల మేర‌కు తిరుమ‌ల రెండు ఘాట్ రోడ్ల‌ల‌లో ఆర్‌సిసి రోడ్లు, క్రాష్ బ్యారియ‌ర్స్‌ నిర్మాణం కోర‌కు మొద‌టి ద‌శ‌లో రూ.20 కోట్లు, రెంద‌వ‌ ద‌శ‌లో 15 కోట్ల‌తో ఆమోదం.

– శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు కేటాయింపుకు నిర్ణ‌యం. 2023 మార్చి నాటికి రెండ‌వ ద‌శ ప‌నులు పూర్తి.

– తిరుమల బాలాజీ నగర్ వ‌ద్ద‌ 2.86 ఎకరాల స్థ‌లం ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌కు ఏర్పాటుకు నిర్ణ‌యం.

– తిరుమలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం.

– టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ సిద్దాంతిని 2022-23 వ సంవత్సరానికి నియమించడానికి నిర్ణ‌యం.

– చెన్నైకి చెందిన శ్రీమతి ఆర్‌.క‌ర్ణావతి టీటీడీకి విరాళంగా అందించిన పాండిచ్చేరిలోని రూ.58 ల‌క్ష‌ల విలువ గ‌ల ఇంటిని స్వీకరించేందుకు నిర్ణ‌యం.

– టీటీడీ ఉద్యోగుల కోసం తిరుమ‌ల‌లో గ‌ల క్వార్ట‌ర్స్ అభివృద్ధి చేసేందుకు రూ.19.40 కోట్ల‌తో టెండ‌రు ఆమోదం.

– ఇప్పటి వరకు టీటీడీలో నగదు విరాళమిచ్చిన భక్తులకే ప్ర‌త్యేక సౌక‌ర్యాలు కల్పిస్తున్నాం. ఇకపై వ‌స్తు రూపంలో విరాళాలు అందించే దాత‌ల‌కు కూడా న‌గ‌దు రూపంలో విరాళాలు అందించే దాత‌ల త‌ర‌హాలో ప్ర‌యోజ‌నాలు వ‌ర్తింప‌చేసేందుకు నిర్ణ‌యం.

టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరిజవహర్ లాల్, బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ కృష్ణారావు, శ్రీ పార్థ‌సార‌ధి రెడ్డి, శ్రీ మారుతీ ప్ర‌సాద్‌, శ్రీ రాజేష్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ రాములు, శ్రీ నంద‌కుమార్‌, శ్రీ విద్యాసాగ‌ర్ రావు, శ్రీ స‌న‌త్ కుమార్‌, శ్రీ మిలింద్ నర్వేకర్, శ్రీ శ‌శిధ‌ర్‌, శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, శ్రీ శంక‌ర్‌, శ్రీ విశ్వ‌నాథ్, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ సంజివ‌య్య‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.