TTD VIG SLEUTHS NAB CULPRITS _ భక్తుల నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగింత

Tirumala, 6 March 2022: The Vigilance Wing sleuths on Sunday nabbed two persons for having theft a bag belonging to pilgrims within 35 minutes.

Going into details, A Murugan and Hussain Baig procured free darshan tickets in Tirupati. Instead of going for darshan, they wandered in places where pilgrims influx is more.

They have stolen a bag which has three mobiles, and cash of Rs.15,330/-. Based on the complaint given by pilgrims to Vigilance over their missing baggage, the TTD cops plunged into action and with the help of technology, they nabbed the two culprits at Alipiri Down Toll Gate in a little more than half an hour time and registered a case against them in Two Town Police Station at Tirumala.

The pilgrims thanked TTD Vigilance for restoring their mobiles and bag.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగింత

– నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది

తిరుమల, 2022 మార్చి 06: తిరుమలలో భక్తుల నగదు, సెల్ ఫోన్లు కలిగిన బ్యాగును చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆదివారం అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం తిరుమల టు టౌన్ పోలీసులకు అప్పగించారు.

కర్ణాటకకు చెందిన ఏ.మురుగన్, హుస్సేన్ బేగ్ ఆదివారం ఉదయం తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు పొంది తిరుమలకు చేరుకున్నారు. దర్శనానికి వెళ్లకుండా తిరుమలలో భక్తులు ఎక్కువ గుంపుగా ఉన్న ప్రాంతంలో బ్యాగును కాజేశారు. అందులో ఉన్న మూడు సెల్ ఫోన్లు, రూ.15,330 /- నగదు ఉన్నాయి. బ్యాగు పోయిన విషయాన్ని గుర్తించిన భక్తులు స్థానిక టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 35 నిమిషాల్లో తిరుపతి అలిపిరి డౌన్ టోల్గేట్ వద్ద నిందితులను పట్టుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పంపడమైనది.

టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.