TTD’s “SAMPRADAYA BHOJANAM” TRIAL RUN COMMENCES _ తిరుమలలో ప్రయోగత్మకంగా సాంప్రదాయ భోజనం ప్రారంభం
ANNAPRASADAM TO DEVOTEES ON THE LINES OF GOVINDUNIKI GO ADHARITA NAIVEDYAM
TIRUMALA, 26 AUGUST 2021: With a noble aim and gesture to promote Desi cow products, organic and natural farming TTD has ventured on yet another novel idea providing healthy food to devotees in the name of “Sampradaya Bhojanam”.
A trial-run of the same was commenced at Annamaiah Bhavan in Tirumala on Thursday. It may be mentioned here that the TTD Board has resolved to prepare the Naivedyam of Sri Venkateswara Swamy with the ingredients cultivated out of Desi Cow Panchagavya products. The Prasadams prepared out of the rice, jaggery, cereals, ghee etc. that were produced through Natural Farming turned out to be delicious and received a huge response from the pilgrims as well.
On the similar lines, TTD wanted to extend the same facility even on Annaprasadam that is being served to devotees during breakfast, meals and dinner. This trial-run will last for eight days up to September 2.
According to Sri Vijayram, the Natural Farming Expert from Vikarabad who has been working hard to bring awareness among the farming fraternity on the benefits of natural farming using Desi cow products said, ”the intention is to bring back hey days for our Desi cows and natural farming techniques which used to have been flourished across India some centuries ago. “After many decades of waiting, we are very happy that a world-renowned religious organization like TTD has come forward to encourage mission. We are confident that this will bring a revolution in the Natural farming technique with Desi Cow products”, he said.
Food Expert Sri Rambabu who is popularly known as “Millet Rambabu” while elaborating on the health benefits of Sridhanyalu (millets) produced out of natural farming, said that the “Sampradaya Bhojanam” will definitely yield fruitful results which include both physical and mental fitness. ”Terming it as ‘Amrita Bhojanam ” the food expert said, in breakfast on the first day Idlis and Upma made out of healthy rice viz. Kullakar and Kalabath were prepared and served to pilgrims. “For lunch, our Chef Sri Gopi, who is an expert in Millet delicacies cooking, has prepared 14 delicacies including Purnalu, Coconut Rice, Pulihora etc. This is what our ancestors gave to us. But we got used to the Western food habits. But with the blessings of Sri Venkateswara, the golden old days are back and this is the beginning of the healthiest way of living”, he asserted.
DyEO Annaprasadam Sri Harindranath, Tirumala Temple Sri Ramesh Babu, Reception 1 Sri Lokanatham, Reception 2 Sri Bhaskar, EE 1 Sri Jaganmohan Reddy, former Board Member Sri Siva Kumar also tasted the delicious “Sampradaya Bhojanam” along with the pilgrims.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ప్రయోగత్మకంగా సాంప్రదాయ భోజనం ప్రారంభం
తిరుమల, 2021 ఆగస్టు 26: తిరుమలలో శ్రీవారి భక్తుల కొరకు సాంప్రదాయ భోజనం ప్రయోగత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభించారు.
టీటీడీ ఇప్పటికే గోవిందదునికి గో ఆధారిత నైవేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్ఫాహరం, భోజనం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టిటిడి భక్తులకు అందించాలని సంకల్పించింది. సాంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని సెప్టెంబర్ 8వ తేదీ వరకు టిటిడి ప్రయోగత్మకంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా దేశీయ వ్యవసాయ పరిశోధకులు శ్రీ విజయరామ్ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలను టిటిడి కోనుగోలు చేయడం అభినందనీయమన్నారు. దీనిద్వారా దేశీయ విత్తనాలు, దేశీయ గో జాతులను గ్రామల్లోకి పునః ప్రవేశపెట్టవచ్చన్నారు.
అనంతరం చిరుధాన్యాల ఆహర నిపుణులు శ్రీ రాంబాబు మాట్లాడుతూ దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంటలు వండి భక్తులకు వడ్డిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం కుల్లకారు బియ్యంతో ఇడ్డీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మ తయారు చేసి అందించినట్లు తెలిపారు. ఇందులో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, అనేక వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోదక శక్తి ఉంటుందన్నారు. మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణలు, వర్ష రుతువులో తీసుకోవసిన అహారమైన పచ్చి పులుసు, దోశకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు చెఫ్ శ్రీ గోపి వండి భక్తులకు అందించినట్లు వివరించారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మన ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్‌బాబు, శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, ఇఇ జగన్మోహన్ రెడ్డి,మాజీ బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.