TWO BROKERS BOOKED IN TIRUMALA _ తిరుమ‌ల‌లో ఇద్ద‌రు దళారులపై కేసు న‌మోదు

Tirumala, 12 April 2022: Following the complaint lodged by TTD Vigilance department, the Tirumala police have registered cheating case on two brokers who collected huge amounts from devotees for providing fake Srivari Darshan tickets.

Details of the cases are that a broker Suri had collected ₹22,800 via Google pay from a Bangalore devotee Sri Jayaprakash and promised of getting Rs. 300 SED tickets and later vanished.

Similarly in another case, a broker Chandrasekhar, an auto driver collected ₹5000 from a five-member family of R Sharat Kumar of Villupuram from Tamilnadu and sent darshan tickets on Whats App, which were proved to be fake at the scanning point.

Following the complaints from the devotees, the TTD vigilance reported the matter to Tirumala II Town Police who registered cases against the conmen Suri and Chandrasekhar and are on lookout for them.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

తిరుమ‌ల‌లో ఇద్ద‌రు దళారులపై కేసు న‌మోదు

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 12: తిరుమలలో ఇద్ద‌రు ద‌ర్శ‌న టికెట్ల‌ దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

తిరుపతికి చెందిన సూరి అనే దళారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు ఇప్పిస్తాన‌ని బెంగ‌ళూరుకు చెందిన శ్రీ జ‌య‌ప్ర‌కాష్ అనే భ‌క్తుడి నుంచి రూ.22,800/- గూగుల్ పే ద్వారా తీసుకున్నాడు. అనంత‌రం టికెట్లు ఇవ్వ‌కుండా మోసం చేశాడు.

అదేవిధంగా, త‌మిళ‌నాడులోని విల్లుపురానికి చెందిన ఆర్‌.శ‌ర‌త్‌కుమార్ ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌తో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుప‌తికి చేరుకున్నారు. ఆన్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల కోసం ప్ర‌య‌త్నించ‌గా అందుబాటులో లేవు. వీరు అలిపిరి పాదాల వ‌ద్ద ఉండ‌గా చంద్ర‌శేఖ‌ర్ అనే ఆటోడ్రైవ‌ర్ ప‌రిచ‌యం చేసుకుని ద‌ర్శ‌న టికెట్లు ఇప్పిస్తాన‌ని గూగుల్ పే ద్వారా రూ.5000/- వ‌సూలు చేశాడు. శ‌ర‌త్‌కుమార్‌కు వాట్సాప్‌లో ద‌ర్శ‌న టికెట్లు పంపాడు. ఈ టికెట్ల‌తో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా స్కానింగ్ పాయింట్ వ‌ద్ద న‌కిలీవిగా గుర్తించారు.

బాధితుల‌ ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ఇద్ద‌రు ద‌ళారుల‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ద‌ర్శ‌న టికెట్ల పేరుతో మోసం చేసిన సూరి, చంద్ర‌శేఖ‌ర్‌ల‌పై తిరుమ‌ల టూ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.