TWO-DAY AGAMA SADAS CONCLUDES IN SVVU _ ఎస్వీ వేద వర్సిటీలో ముగిసిన రెండు రోజుల ఆగమ సదస్సు

TIRUPATI, 20 JANUARY 2023: The two-day National Seminar on Agamas concluded in Sri Venkateswara Vedic University in Tirupati on Friday evening.

The TTD-run varsity has organised the Sadas wherein Agama scholars from across the nation participated with enthusiasm. 

For the valedictory ceremony, one of the chief priests of Tirumala Temple Sri Venugopala Deekshitulu graced and spoke on the importance of Balalayam in Agamas. He appreciated the efforts of SVVU for organising the two day national seminar on important topics like Agamas, Balalayam, other rituals etc. 

Vice-chancellor Sri Rani Sadasiva Murthy said the outcome of the sadas will be brought out in the form of a book for the sake of future purpose. 

Later both the VC and chief priest inaugurated a library dedicated in memory of Vedic scholar Sri Agnihotram Srinivasacharulu.  

Renowned Vaikhanasa Agama Scholar Sri Varadan, Panchratra Scholar Sri T Srinivasan, Saivagama Scholar Sri Ganapati Sharma were awarded “Agama Kalpadruma” titles on the occasion.

Convenor Sri Brahmacharyulu and other scholars, students were present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ వేద వర్సిటీలో ముగిసిన రెండు రోజుల ఆగమ సదస్సు

తిరుపతి, 2023 జనవరి 20: టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆగమాలలో బాలాలయ ప్రక్రియ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగిన జాతీయ ఆగమ సదస్సు శుక్రవారం ముగిసింది.

ఉదయం జరిగిన బాలాలయే అర్చన విచారః అంశానికి టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ వేదాంతం గోపాలకృష్ణమాచార్యులు అధ్యక్షత వహించారు. ఇందులో ముగ్గురు పత్ర సమర్పణ చేశారు.

అనంతరం బాలాలయే ఉత్సవ విచారః అనే అంశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగమ సలహా మండలి చైర్మన్ శ్రీ వేదాంతం సత్య శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించారు. ఇందులో ముగ్గురు పత్రసమర్పకులు పత్రమర్పణ చేశారు

అనంతరం ఆగమ సదనంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆచార్య అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారి స్మారక గ్రంథాలయాన్ని ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు ప్రారంభించారు.

ఆ తరువాత ఉపకులపతి అధ్యక్షతన సమాపనోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు. ముందుగా సదస్సు కన్వీనర్ డాక్టర్ టి.బ్రహ్మాచార్యులు సదస్సు నివేదికను, చర్చించిన విషయాలను తెలిపారు.

అనంతరం శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ఆగమశాస్త్ర విరుద్ధం కాని దేశాచార, శిష్టాచార మిళితమైన బాలాలయ ప్రక్రియ జరపాలన్నారు. ఆగమ శాస్త్రాల్లోని అంతర్గత విషయాలను వెలికి తీయుటకు తరచూ ఆగమ సదస్సులు నిర్వహించాలని, వర్సిటీ కృషి అభినందనీయమని తెలిపారు.

అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ ఆగమ శాస్త్రాలలోని మర్మాలను వెలికితీయుటకు నిర్వహించిన ఈ సదస్సులో చర్చించిన అంశాలతో వ్యాసాలను ముద్రిస్తామన్నారు.

అనంతరం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైఖానస ఆగమ పండితులు శ్రీ పి.వరదన్, చెన్నైకి చెందిన ప్రముఖ పాంచరాత్రాగమపండితులు శ్రీ టి.శ్రీనివాసన్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ శైవ ఆగమ పండితులు శ్రీ పి.గణపతి శర్మకు ఆగమ కల్పద్రుమ అవార్డులను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో సంచాలకులు శ్రీ రామకృష్ణ, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ నీలకంఠం, డాక్టర్ భరత్ శేఖరాచార్యులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.