UNVEILING OF JUBILEE HILLS SRI VENKATESWARA SWAMY’S BRAHMOTSAVAM MURAL _ జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 20 February 2024: TTD Chairman Sri Bhumana Karunakara Reddy unveiled the Brahmotsavam wall poster of Sri Venkateswara Swamy Temple in Jubilee Hills, Hyderabad on Tuesday. 

The program was held at the Chairman’s residence in Padmavathi Puram in Tirupati.

The annual Brahmotsavam will be held in this temple from March 8 to 16. 

Brahmotsavam starts on the evening of  March 7 with Ankurarpanam. The Vahana Sevas will be observed from 8 AM to 9 AM and from 8 PM to 9 PM.  Pushpayagam will be held on March 17 from 3pm to 5 pm.

Temple Deputy EO Sri M. Ramesh Babu participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి, 2024 ఫిబ్ర‌వ‌రి 20: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ను మంగ‌ళ‌వారం టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి పురంలో గ‌ల ఛైర్మ‌న్ నివాసంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ ఆల‌యంలో మార్చి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎం.ర‌మేష్‌బాబు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.