VAMANAVATHARAM AS SAND ART THEME FOR THIS BRQHMOTSAVAMS_ 2018 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేకం ప్రత్యేక ఆకర్షణగా వామనావతార సైకత శిల్పం

Tirumala, 11 September 2018: The sand art sisters duo, Ms. Gowri and Ms. Neelambika have come out with yet another interesting mythological concept, Vamanavatharam for this brahmotsavams.

One being an engineer and another a journalism student, these girls from Mysore started doing sand art themes for special occasions since 2011 as they developed immense passion towards sand art and underwent professional training too.

So far the sisters did “Saikatha” art in around 40 places across the country. Some of the noteworthy works includes Devi Chamundeswari during Mysore Dasara festival, Mahabharata at Lalbagh in Bengaluru, Eco Friendly Ganesha at Belgaum, Marine sand art in Coimbattore, Tiruchy etc. In Tirumala, so far they have attracted millions of devotees with their sand art sculpts during brahmotsavams with Garuda, Mahalakshmi, Varaha Swamy, Matsyavatara, Ksheeradhara themes.

Now in Vamanavathara with lord as little Vamana and Balichakravarthi, the sand art depicted one of the most important avatarams, the Trivikrama Swaroopam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2018 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేకం ప్రత్యేక ఆకర్షణగా వామనావతార సైకత శిల్పం

సెప్టెంబరు 11, తిరుమల 2018: పురాతన కళారూపాల్లో ఒకటైన సైకత శిల్పకళ నాలుగేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి వామనుడి సైకత శిల్పాన్ని రూపొందించారు. టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఈ సైకత శిల్పం భక్తిభావాన్ని పంచుతోంది.

బెంగళూరుకు చెందిన కుమారి గౌరి, కుమారి నీలాంబిక ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ ఇద్దరు యువతులు సైకత శిల్పకళలో ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీని పూర్తి చేశారు. వీరు పౌరాణికాంశాలను సందర్భానికి తగ్గట్టు ఇసుకతో శిల్పంగా మలచడంలో సిద్ధహస్తులు.

టిటిడి ఉద్యానవన విభాగం 2014 శ్రీవారి బ్రహ్మోత్సవాల నుంచి ఫలపుష్ప ప్రదర్శనశాలలో సైకత శిల్పాలకు చోటు కల్పిస్తోంది. ఇప్పటివరకు శ్రీభూవరాహస్వామి, వైకుంఠం నుంచి శ్రీవారి ఆనందనిలయ విమానాన్ని తీసుకొస్తున్న గరుత్మంతుడు, మత్య్సావతారం రూపాలను ఈ యువతులు ఇసుకతో తీర్చిదిద్దారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామనావతార శిల్పం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో వామనుడు, బలిచక్రవర్తి రూపాలున్నాయి. కాగా, కుమారి గౌరి, కుమారి నీలాంబిక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సైకత శిల్పాలను రూపొందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.