VARUNA YAGAM AT SRINIVASA MANGAPURAM FROM SEP 8-11 _ సెప్టెంబ‌రు 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ‌నివాసమంగాపురంలో శ్రీ‌నివాస అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క మ‌హాశాంతి వ‌రుణ‌యాగం

Tirupati, 04 September 2023: As a spiritual antidote for be getting rains TTD is organising the Srinivasa Astottara Shatakundatmaka Maha Shanti Varuna Yagam from September 8-11 at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram under the supervision of one of the Chief Priests of Tirumala temple Sri Venugopal Dikshitulu.

As part of the festivities Punyahavachanam, Mritsangrahanam and Ankurarpanam will be performed at the yagashala on the evening of September 8 after Rutwikvaram rituals in the morning.

On September 9 Vedic rituals of Vastu Homa, Akalmasha Homa, Panchagavya Prashanam, Raksha Bandhanam and Gopuja will be observed.

On September 10,  Aswa puja is performed in yagashala.

On the last day on September 11 the rituals of Gopuja, Purnahuti and Chakra Snanam will be performed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ‌నివాసమంగాపురంలో శ్రీ‌నివాస అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క మ‌హాశాంతి వ‌రుణ‌యాగం

తిరుపతి, 2023 సెప్టెంబ‌రు 04: సువృష్టిగా వ‌ర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాల‌ని కోరుతూ టీటీడీ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌రు 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ‌నివాసమంగాపురంలో శ్రీ‌నివాస అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క మ‌హాశాంతి వ‌రుణ‌యాగం జరుగ‌నుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు ఈ యాగం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

సెప్టెంబ‌రు 8న ఉద‌యం శ్రీ‌నివాసమంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 గంట‌ల‌కు యాగశాల‌లో పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ చేప‌డ‌తారు.

సెప్టెంబ‌రు 9న ఉద‌యం వాస్తుహోమం, అక‌ల్మ‌ష‌హోమం, పంచ‌గ‌వ్య ప్రాశ‌నం, ర‌క్షాబంధ‌నం, గోపూజ నిర్వ‌హిస్తారు. సాయంత్రం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

సెప్టెంబ‌రు 10న ఉద‌యం అశ్వ‌పూజ‌, సాయంత్రం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 11న ఉద‌యం 7.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు గోపూజ‌, పూర్ణాహుతి, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.