VEHICLES FITNESS TEST AT ALIPERI- TTD CHAIRMAN _ భక్తుల భద్రత కోసం అలిపిరిలో వాహనాల ఫిట్ నెస్ తనిఖీ-టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

  • CHILDRENS HOSPITAL READY BY DECEMBER
  • SRINIVAS SETHU BY JUNE

Tirupati, 1 June, 2023:In the background of several ghat road accidents TTD chairman Sri Subba Reddy on Thursday directed officials to ensure mandatory fitness checks of all vehicles at Alipiri before proceeding towards Tirumala. 

The chairman inspected the Alipiri check post, the progress of works on Sri Padmavati children hospital, and Srinivas Sethu on Thursday evening. 

Speaking to the media TTD chairman said the CVSO has been asked to submit a report on the purchase of modern vehicle check equipment and also increase never of quelines at the Alipiri check post to ensure no delay to devotees. 

Among others, he lauded check post officials, and professors of works at children’s hospital and ready it fir inaugural by honourable AP CM  by December 2023.

 
He said the srinivas sethu works  in which TTD ha 65% share,delayed due to technical reasons will be dedicated to nation by July this year

 

Earlier he insoected the divya darshan token system and medical Center out up by Global hospital at Gali gopuram location.

TTD Jeo Sri Veerabrahma m, cvso Sri Narsimha Kishore, municipal commissioner smt harita, ce Sri Nageshwar Rao, municipal Corporation SE Sri Mohan, TTD IT GM Sri Sandeep, Apcon GM Sri Rangaswami 

and others were present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తుల భద్రత కోసం అలిపిరిలో వాహనాల ఫిట్ నెస్ తనిఖీ

– డిసెంబరులో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జూన్ నెలాఖరుకు శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పూర్తి

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 1 జూన్ 2023: తిరుమల ఘాట్ రోడ్ లో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

అలిపిరి చెక్ పోస్టు తోపాటు శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు, శ్రీనివాస సేతు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. తిరుమల కు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటుచేసే అంశంపై నివేదిక అందించాలని సివీఎస్వో ను ఆదేశించామన్నారు. అలిపిరి చెక్ పోస్టు లో వాహనాల తనిఖీ లో ఆలస్యం జరిగి భక్తులు అసహనానికి గురి కాకుండా ఉండడం కోసం వాహనాల తనిఖీ క్యూ లైన్ల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన చెప్పారు. చెక్ పోస్టు లో విజిలెన్స్ సిబ్బంది బాగా తనిఖీలు చేస్తున్నారని, తిరుమలకు వాటర్ బాటిల్లు తీసుకుని వెళ్లకుండా మరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని సూచించారు.

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు ప్రారంభించారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్ కు ఫ్లైఓవర్ మొత్తం పూర్తికావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందని చెప్పారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జులై లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
అంతకు ముందు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గాలి గోపురం వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. భక్తుల కోసం గ్లోబల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ హరి కిషోర్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ శ్రీ మోహన్, టీటీడీ ఐటి జి ఎం శ్రీ సందీప్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ శ్రీ రంగస్వామి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది