VENUGOPALA ALANKARAM _ సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో వేణుగోపాలుడి కటాక్షం

Tirupati, 31 May 2024: On the third day of the ongoing Sri Venugopalaswamy annual Brahmotsavam at Karvetinagaram, Sri Venugopala Swamy Alankaram enthralled devotees on the ferocious Simha Vahanam on Friday.
 
AEO Sri. Parthasarathy, Superintendent Sri Somasekhar, temple priests and a large number of devotees participated.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో వేణుగోపాలుడి కటాక్షం

తిరుపతి, 2024 మే 31: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్
శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.