VETURI IS A MULTIFACETED PERSONALITY _ శ్రీ‌మాన్ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి బ‌హుముఖ ప్ర‌జ్జాశాలి- ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి

Tirupati,29 August 2023: Acharya Rani Sadasiva Murty, the VC of SV Vedic University on Tuesday lauded Sriman Veturi Prabhakar Shastri as a multifaceted personality.

Addressing the 73rd Vardhanti of Veturi at a special meeting held at the SV Oriental College after garlanding his portrait, the VC hailed him as a researcher, epigraphist, compiler of ancient documents and a role model for youth.

Dr Alladi Mohan of SVIMS, TTD Educational Officer Dr Bhaskar Reddy, Dr Vibhishana Sharma, Director of Annamacharya Project, Principal of SV Oriental College Dr S Sitarama Sharma also spoke and hailed Sriman Veturi contributions to society.

Dr K Narayanaswamy Reddy, Sri K Lakshmi Narayana and Bhupathi Naidu were present.

Earlier the bronze statue of Sriman Veturi Prabhakar Shastri was garlanded on the occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌మాన్ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి బ‌హుముఖ ప్ర‌జ్జాశాలి

– ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి

తిరుప‌తి, 2023 ఆగస్టు 29: శ్రీ‌మాన్ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి బ‌హుముఖ ప్ర‌జ్జాశాలి అని ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి కొనియాడారు. శ్రీ‌మాన్ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి 73వ వ‌ర్ధంతి స‌భ తిరుప‌తిలోని ఎస్వీ ప్రాచ్య క‌ళాశాల‌లో మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా క‌ళాశాల‌లోని శ్రీ వేటూరి విగ్ర‌హానికి పుష్ప‌మాలాలంక‌ర‌ణ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి మాట్లాడుతూ కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా శ్రీ‌ ప్రభాకరశాస్త్రి తనదైన ముద్ర వేశారని వివరించారు. విద్యార్థులు వీరిని ఆద‌ర్శంగా తీసుకుని వృద్ధిలోకి రావాల‌ని సూచించారు.

అనంత‌రం స్విమ్స్ వైద్య నిపుణులు డాక్ట‌ర్ అల్లాడి మోహ‌న్‌, విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్క‌ర్‌రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్‌.సీతారామ‌శ‌ర్మ మాట్లాడుతూ శ్రీ వేటూరివారి సాహితీ విష‌యాల‌ను విద్యార్థుల‌కు తెలియ‌జెప్పారు. విద్యార్థులు ప్రాచ్య సంస్కృతుల‌ను కాపాడుకోవాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల అధ్యాప‌కులు డా.కె.నారాయ‌ణ‌స్వామిరెడ్డి, శ్రీ కె.ల‌క్ష్మీనారాయ‌ణ‌, భూప‌తి నాయుడు త‌దిత‌ర అధ్యాప‌కులు పాల్గొన్నారు.

వేటూరి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి

వ‌ర్ధంతి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఉద‌యం శ్వేత భ‌వ‌నం ఎదురుగా గ‌ల శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి విగ్ర‌హానికి ఘ‌నంగా పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, శ్వేత సంచాల‌కులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్క‌ర్‌రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, ఎస్వీ ప్రాచ్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్‌.సీతారామ‌శ‌ర్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.