VISHNU SAHASRANAMA PARAYANAM ON FEBRUARY 23 _ ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం వేదపండితులతో ట్రయల్ రన్
Tirumala, 21 Feb. 21: On the auspicious occasion of Bhishma Ekadashi on February 23, TTD has mulled a-three hour long Vishnu Sahasranama Parayanam from the Nadaneerajanam platform at Tirumala which will be telecasted live on SVBC from 7 a.m. onwards.
In connection with this program, Vedic Pundits conducted a trial run on Sunday.
On February 23, Vedic scholars from Dharmagiri Veda Vigyana Peetham, SV Vedic University, National Sanskrit University, Higher Vedic Studies, and Veda Parayanamdars of Tirumala Temple will take part in this program.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం వేదపండితులతో ట్రయల్ రన్
తిరుమల, 2021 ఫిబ్రవరి 21: భీష్మ ఏకాదశి సందర్భంగా ఫిబ్రవరి 23న ఉదయం ఏడు గంటలకు తిరుమల నాదనీరాజనం వేదికపై విష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది. దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఆదివారం నాడు నాదనీరాజనం వేదికపై వేదపండితులతో విష్ణు సహస్రనామ పారాయణం ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ అష్టోత్తరం 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు, విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు, ఉత్తరపీఠిక 34 శ్లోకాలు పారాయణం చేయాలని నిర్ణయించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు, టిటిడి వేదపారాయణదారులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ స్కీమ్ వేదపారాయణదారులు ఈ పారాయణంలో పాల్గొంటారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.