YAGNAS ALL ROUND THE YEAR BY TTD-JEO (H&E) _ టీటీడీ ఆధ్వర్యంలో 365 రోజులూ యజ్ఞ, యాగాదులు, వ్రతాలు- ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం

TIRUPATI, 04 MAY 2023: Henceforth TTD will observe Yagnams and Vratams(sacred rituals) all the 365 days in a year and the officials concerned should come out with an action plan and gear up for the same, said JEO(H&E) Smt Sada Bhargavi.

 

A review meeting was held by the JEO in her chambers in TTD Administrative building in Tirupati on Thursday on the Manuscripts Project. Speaking on the occasion, the JEO directed that officials should make arrangements for Homa Gundams and seating arrangements for 150 people. She said the SVBC has to telecast all these rituals live for the sake of global devotees.

 

She also said, the programme updates should be uploaded in all the social media networks of TTD after recording them in Vedic University Studio by this May end. “For NAAC recognition, NEP and syllabus framing shall be completed during the summer vacation. The university should also plan for online classes in the evening”, she maintained.

 

On the progress of the Manuscripts Project, she said, out of 5000 bundles, the scanning of 3500 have been completed and the remaining should also be finished within next couple of months. She also reviewed on the progress of the ongoing Nakshatra Vanam works with the engineering officials. 

 

SVBC CEO Sri Shanmukh Kumar, Vedic University VC Sri Ranisadasivamurty, Registrar Sri Radhesyam, EE Sri Mallikharjuna Prasad and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఆధ్వర్యంలో 365 రోజులూ యజ్ఞ, యాగాదులు, వ్రతాలు

– ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం

తిరుపతి 4 మే 2023: లోక క్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయంలో సంవత్సరంలో 365 రోజులు యజ్ఞ, యాగాదులు, వ్రతాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో గురువారం ఆమె శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్బంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, యజ్ఞ,యాగాదులు, వ్రతాల నిర్వహణ కోసం అవసరమైన యజ్ఞశాలలు, హోమ గుండాలతో పాటు దాదాపు 150 మంది భక్తులు కూర్చునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఎస్వీ బీసీ ద్వారా ప్రజలకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు.

వేదాలు, పురాణాల్లో చెప్పబడిన వ్యక్తిత్వవికాసోపాయాలను శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం పండితుల చేత చెప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జేఈవో చెప్పారు. మే నెలాఖరు లోపు ఈ కార్యక్రమాలను అప్ లోడ్ చేయడానికి అనుగుణంగా వేద విశ్వవిద్యాలయం స్టూడియోలో ఉపన్యాసాల చిత్రీకరణ ప్రారంభించాలన్నారు.

యు ట్యూబ్ , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వీటిని ప్రచారం చేయాలన్నారు. వేదాల్లోని వైద్య ప్రక్రియలు, ఆధునిక జీవన విధానానికి సైతం
ఆ విజ్ఞానం తోడ్పడుతున్న విషయాలపై ఎస్వీ బీసీ సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. వీటిని ఎస్వీ బీసీలో ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు.

వేదవిశ్వవిద్యాలయానికి న్యాక్ గుర్తింపు ప్రక్రియ, జాతీయ విద్యావిధానం అమలు, సిలబస్ తయారీ లాంటి పనులన్నీ వేసవి సెలవులు ముగిసేలోగా పూర్తి చేయాలన్నారు.
మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టు పనుల వేగం మరింత పెంచాలని జేఈవో చెప్పారు . ఇందుకు అవసరమైన స్కానర్లు, సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. 5 వేల తాళపత్రాల బండిల్స్ లోఇప్పటి దాకా దాదాపు 3500 బండిల్స్ తాళపత్రాల స్కానింగ్ పూర్తి చేశారని అన్నారు. మిగిలిన వాటిని రెండు నెలల్లో స్కాన్ చేయడానికి తగిన వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్కాన్ చేసిన తాళపత్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 500 సంవత్సరాలు గడిచినా పాడవకుండా ఉండేలా భద్రపరచడానికి భవనం నిర్మించుకోవడానికి స్థల ఎంపిక చేశామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు భవన నిర్మాణ ప్లాన్ సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు. ఎస్వీ విశ్వ విద్యాలయంలో పాటు ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న తాళపత్రాలను స్కాన్ చేసి భద్రపరచేలా ఎం ఓయూ లు చేసుకోవాలన్నారు. స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక వాటిని క్లౌడ్, గూగుల్ డ్రైవ్ లో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జేఈవో చెప్పారు.

విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సుల ప్రారంభానికి అవసరమైన తరగతి గదులు, డిజిటల్, ఫిజికల్ లైబ్రరీలను, యోగా హాల్ , సిబ్బంది గదులను ఇప్పుడు ఉన్న భవనాల్లోనే ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆఫ్ లైన్ తరగతులు పూర్తి అయ్యాక సాయంత్రం వేళల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించే ఆలోచన చేయాలని ఆమె సూచించారు.

నక్షత్ర వనాల ప్రగతిపై జేఈవో సమీక్షిస్తూ అటవీ విభాగం తో సమన్వయం చేసుకుని త్వరగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎస్వీ బీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ షణ్ముఖ్ కుమార్, వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య రాధే శ్యామ్, ఈ ఈ శ్రీ మల్లిఖార్జున్ సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది