YUDDHAKANDA PARAYANAM FOR THE WELFARE OF HUMANITY- TTD ADDITIONAL EO _ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం యుద్ధ‌కాండ పారాయ‌ణం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 09 June 2021: In its spiritual drive to rescue humanity from pandemic Corona, TTD is conducting the Yuddhakanda Parayanam from the epic Ramayana at Vasantha Mandapam in Tirumala from June 11 up to July 10, said TTD Additional EO Sri AV Dharma Reddy.

Addressing a review meeting on the arrangements for the religious program with Vedic Pundits at Vasanta Mandapam in Tirumala on Wednesday, TTD Additional EO said TTD had during the year conducted Shodasha Dina Sundarakanda Parayanam from May 3 to18 including Nakshatra Satra Maha Yagam on May 9. Thereafter historic one-day Sampoorna Akhanda Sundarakanda Pathanam was held on May 31, which lasted for over 16 hours from 6am to 10pm.

In Yuddhakanda Parayanam, 16 Vedic Pundits each in Vasanta Mandapam and at Dharmagiri Veda Pathashala will conduct Parayanam and Japa-Tarpana- Homa programs respectively for 30 days.

 

For benefit of Srivari devotees across the world, the program will be live telecasted by the SVBC at 8.30 am.

Speaking on the occasion Principal of Dharmagiri Veda Vijnana Peetham Sri KSS Avadhani said Ankurarpanam for the Yuddhakanda Parayanam will be held on Thursday between 7pm and 8pm.

Srivari temple DyEO Sri Harindranath, SVBC CEO Sri Suresh Kumar, Health Officer Dr RR Reddy, VGO Sri Bali Reddy, Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu, OSD of SV Higher Vedic Studies Institute Dr Akella Vibhishana Sharma and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం యుద్ధ‌కాండ పారాయ‌ణం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 జూన్ 09: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ‌ను జూన్ 11వ తేదీ నుండి జూలై 10వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. వ‌సంత మండ‌పంలో యుద్ధ‌కాండ పారాయ‌ణంపై బుధ‌వారం ఉద‌యం అద‌న‌పు ఈవో అధికారులు, పండితుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మ‌రిని నిర్ములించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి అనేక వైదిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష, మే 9వ తేదీ నుండి నక్షత్రసత్ర మహాయాగం నిర్వ‌హిస్తోన్నార‌న్నారు. అదేవిధంగా మే 31న 16 గంట‌ల పాటు ఏక దిన అఖండ‌ సుద‌ర‌కాండ పారాయ‌ణం జ‌రిగింద‌న్నారు.

సుంద‌ర‌కాండ‌లో ఆంజ‌నేయ‌స్వామివారు సీతాదేవిని అన్వేషిస్తూ లంక న‌గ‌రం చేరుకుని లంకా ద‌హ‌నం చేసి సీత‌మ్మ జాడ‌ను శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి తెలిపార‌న్నారు. యుద్ధ‌కాండ‌లో రాములవారు వాన‌ర సైన్యంతో రావ‌ణుని లంకాన‌గ‌రం చేరుకుని ర‌క్ష‌స వీరుల‌ను సంహ‌రించి సీత‌మ్మ‌వారిని తీసుకువ‌స్తార‌న్నారు. యుద్ధ‌కాండ పారాయ‌ణం 30 రోజుల పాటు 16 మంది వేద పండితులు వ‌సంత మండ‌పంలో పారాయ‌ణం, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 30 రోజుల పాటు జ‌ప – త‌ర్ప‌ణ – హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తార‌న్నారు. భ‌క్తులు ఈ ప‌రాయ‌ణంలోని శ్లోకాల‌ను వీక్షించిన‌, ప‌ఠించిన‌, శ్ర‌వ‌ణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంద‌న్నారు.

ధ‌ర్మ‌గిరి వేద వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని మాట్లాడుతూ సీతా స‌మేతుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, ఆంజ‌నేయ‌స్వామివారి అ‌నుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని మాన‌వులు ధ‌ర్మాని ఆచ‌రిస్తూ, స‌క‌‌ల శుభాల‌ను పొందాల‌ని ఆకాంక్షిస్తూ 30 రోజుల పాటు యుద్ధ‌కాండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి గురువారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంద‌ని చెప్పారు.

అంత‌కుముందు అద‌న‌పు ఈవో యుద్ధ‌కాండ పారాయ‌ణం ఏర్పాట్ల‌పై అధికారులు, పండితుల‌తో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్‌కుమార్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, , ఇత‌ర అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.