ముంబై లో వేడుకగా శ్రీవారి కల్యాణం
ముంబై లో వేడుకగా శ్రీవారి కల్యాణం తిరుమల 25 ఫిబ్రవరి 2024: ముంబై మహానగరంలోని తూర్పు దోంభివలి ప్రాంతంలో ఆదివారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, టీటీడీ నిర్వహిస్తున్న సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని అభినందించారు. […]
