రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి తిరుమల, 2024 జనవరి 24: తిరుమలలో జనవరి 25న గురువారం జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. […]
