GAJA LAKSHMI BLESSES ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి […]