కల్పవృక్ష వాహనంపై గోవిందరాజస్వామి వైభవం
కల్పవృక్ష వాహనంపై గోవిందరాజస్వామి వైభవం తిరుపతి, మే 20, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి […]
