జూన్ 22న తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారం ఊరేగింపు
జూన్ 22న తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారం ఊరేగింపు తిరుపతి, జూన్ 21, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లక్ష్మీహారాన్ని ఉదయం 10.30 గంటలకు తిరుపతికి తీసుకొస్తారు. శ్రీవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, అర్చకులు లక్ష్మీహారాన్ని తీసుకొచ్చి శ్రీనివాసంలో అప్పలాయగుంట ఆలయ […]
