సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షం
సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షం తిరుమల, 28 జనవరి 2023: తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా ఆరో వాహనమైన సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరిగింది. సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి (సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు) : సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి […]
