శ్రీవారి పాదాలమండపంలోని ఆలయాలలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”
శ్రీవారి పాదాలమండపంలోని ఆలయాలలో శాస్త్రోక్తంగా ”బాలాలయం” తిరుపతి, 2020 ఫిబ్రవరి 25: తిరుపతిలోని అలిపిరి వద్దగల శ్రీవారి పాదాల మండపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ పెరియాళ్వార్ ఆలయం, శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయాలలో బాలాలయం పనులు మంగళవారం ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం అగ్నిప్రణయణం, చిత్రపటాలకు కుంభారాధన, అకల్మషహోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం మహాశాంతి పూర్ణాహుతి, బాలాలయ చిత్రపటాలకు మహాశాంతిప్రోక్షణ నిర్వహించనున్నారు. […]
