టిటిడి విద్యాదాన ట్రస్టుపై జెఈవో సమీక్ష తిరుపతి, 2019 మార్చి 16: టిటిడి విద్యాదాన ట్రస్టు కార్యకలాపాలపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం శనివారం తమ బంగళాలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించాలన్నారు. టిటిడి పరిధిలోని అన్ ఎయిడెడ్ పాఠశాలలైన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి పాఠశాల, తాటితోపులోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పాఠశాల, తిరుపతి, భీమవరం, వరంగల్ ప్రాంతాల్లో గల ఎస్వీ బదిర పాఠశాలల విద్యార్థులకు గతేడాది తరహాలోనే […]