PUSHPAYAGAM ON NOVEMBER 11 _ నవంబరు 11న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
నవంబరు 11న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల, 2021 నవంబరు 09: నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర […]
