తెలుగుదనం ఉట్టిపడేలా రాములవారి కల్యాణవేదిక
తెలుగుదనం ఉట్టిపడేలా రాములవారి కల్యాణవేదిక – ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కల్యాణవేదికను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు. ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, […]
