ALL ARJITA SEVAS FOR SRIVARI UTSAVA IDOLS TEMPORARILY SUSPENDED IN TIRUMAL TEMPLE _ శ్రీవారి ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలుపుదల
శ్రీవారి ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలుపుదల తిరుమల, 2020 మార్చి 18: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయడమైనది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది. నిలుపుదల చేసిన వాటిలో విశేషపూజ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ ఉన్నాయి. కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా, ఆర్జిత […]
