DAKSHINAMURTHY HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం తిరుపతి, 2021 నవంబరు 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 12వ తేదీ శుక్రవారం నవగ్రహ హోమం […]
