వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానంతిరుపతి, మే 25, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత తితిదే పరిపాలనా భవనం […]